Sara Ali Khan Pics: సెలబ్రిటీల బ్యూటీ సీక్రెట్స్ తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆన్లైన్లో సర్చ్ చేస్తుంటారు. తమ అభిమాన సెలబ్రిటీల మాదిరి తాము కూడా అందంగా కనిపించాలని ట్రై చేస్తుంటారు. బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్ తన బ్యూటీ సీక్రెట్స్ చెప్పేసింది. శీతాకాలంలో చలిని తట్టుకుంటూ చర్మాన్ని కాపాడుకోవాలని ఈ భామ సూచిస్తోంది.
శీతాకాలంలో తాను చర్మానికి వెచ్చదనం అందించే ప్రొడక్ట్స్ వాడతానని చెప్పారు సారా అలీ ఖాన్. ఈ భామ ఇటీవల ఇటీవల ITC ఫియామా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.
ఉదయం గోరువెచ్చని నీటితో స్నానం చేసి దినచర్యను ప్రారంభించాలని ఈ ముద్దుగుమ్మ చెబుతున్నారు. దీంతో చర్మంలోని సహజ నూనెలు తొలగిపోకుండా ఉంటాయని అంటున్నారు.
రిఫ్రెషింగ్ కోసంచర్మాన్ని సున్నితమైన సువాసనతో.. సూక్ష్మంగా తేమగా ఉంచే హైడ్రేటింగ్ బాడీ మిస్ట్పై స్ప్రిట్జ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఉత్తేజపరిచే సువాసనలు ఉపయోగిస్తే.. రోజంతా ఉల్లాసంగా ఉంటారని చెబుతున్నారు.
2018లో కేదార్నాథ్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ.. తొలి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డు (ఉత్తమ మహిళా అరంగేట్రం)ను అందుకున్నారు.
తండ్రి సైఫ్ అలీ ఖాన్ వారసత్వంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. తనదైన నటనతో ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది.