Bhishma Ashtami 2025: భీష్మాష్టమి ఎందుకు ఆచరిస్తారు..?.. దీని విశిష్టత.. ఈ రోజు తిలతర్పణం తప్పకుండా ఎందుకు చేయాలంటే..?

Bhishma Ashtami 2025: భీష్ముడు తాను అనుకున్న సమయంలో చనిపోయే విధంగా వరం పొందాడు. ఆయన మాఘా మాసంలో అష్టమి తిథి రోజున ప్రాణ త్యాగం చేస్తారు. అందుకు ఈరోజున భీష్మాష్టమిగా జరుపుకుంటాం.
 

1 /6

మహా భారతంలో భీష్ముడి పాత్ర ఎంతో కీలకమైందని చెప్పుకొవచ్చు. భీష్ముడు శంతన మహారాజు, గంగాదేవి పుత్రుడు. తన తండ్రి కోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ఒట్టుపెట్టుకుంటాడు. మహా భారంతంలో కౌరవుల తరపున యుద్దంలో పొరాటం చేస్తాడు. 

2 /6

అయితే.. భీష్ముడు ఎన్నో మార్లు కౌరవులకు చెప్పిచూస్తాడు. కానీ భీష్ముడి మాటలు మాత్రం వారు పట్టించుకోరు. ఈ క్రమంలో మహా భారత యుద్దంలో శిఖండిని తన ముందుకు యుద్దం చేయడానికి రావడంతో భీష్ముడు తన ఆయుధాలను వదిలేస్తాడు. అప్పుడు పాండవులు భీష్ముడిపై బాణాల వర్షంకురిపిస్తాడు. అదేవిధంగా అంపశయ్యపై భీష్ముడ్ని పడేలా చేస్తారు.

3 /6

 భీష్ముడు దాదాపుగా.. అంపశయ్యపై యాభై ఎనిమిది రోజులు ప్రాణాలతో ఉన్నాడని చెప్తుంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం భీష్ముడు వేచి ఉంటారు. ఆ తర్వాత మాఘామాసం అష్టమి తిథి రోజున భీష్ముడు తన ప్రాణాలను వదిలేస్తాడు.భీష్ముడికి పెళ్లి కాలేదు. భీష్మష్టమి రోజున భీష్ముడికి తిలతర్పణం వదిలితే.. గొప్ప పుణ్యం ప్రాప్తింస్తుందని పండితులు చెబుతుంటారు.   

4 /6

ముఖ్యంగా పెళ్లి కానీ వారు, సంతానం లేని వారు  భీష్ముడికి తిలతర్పణం వదిలితే.. వెంటనే కోరిన కోరికలు నెరవేరుతాయంట. ఈసారి భీష్మఏకాదశిని ఫిబ్రవరి 5వతేదీ బుదవారం రోజున జరుపుకోబోతున్నాం. ఈరోజుముఖ్యంగా ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మంచి మూహుర్తం ఉంది.   

5 /6

మధ్యాహ్నం 12గంటల తర్వాత భీష్ముడికి, చనిపోయిన మీ పూర్వీకుల పేర్లను తలచుకుని నువ్వులతో ఐదుసార్లు తిల తర్పణం వదలాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఏడాది పాటు తెలిసీ, తెలియక చేసిన పాపాలన్ని కూడా పాటపంచలౌతాయంట.   

6 /6

భీష్మష్టమి రోజు పండితులకు బియ్యం, పప్పులు, కూరగాయలు దానంగా ఇవ్వాలి. వస్తాలు, పేదలకు అన్నదానం చేయాలి. విష్ణు ఆలయాలను సందర్శించాలి.  అంతే కాకుండా.. ఆరోజున వీలైతే ఉపవాసం ఉండి, ఆవులకు పశుగ్రాసం పెట్టాలి. ఇలా చేస్తే జీవితంలోని సమస్యలన్ని దూరమౌతాయని పండితులు చెబుతుంటారు.