Bhai dooj 2004: భాయ్ దూజ్ ఎప్పుడు..?.. యమధర్మరాజు తన సోదరి యమునకు ఇచ్చిన ఈ వరం గురించి మీకు తెలుసా..?

Bhagini hastha bhojanam: భాయ్ దూజ్ పండగను ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ రోజున సోదరుడు తమ సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతితో వండిన పదార్థాలను తినాలని చెప్తుంటారు.

1 /8

మనం జరుపుకునే ప్రతి పండగ వెనుక గొప్ప ఆచారాలు, సంప్రదాయాలతో పాటు, ప్రేమానురాగాలు కూడా దాగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో దీపావళి పండగ సంబరాలు ప్రారంభమయ్యాయి. దీపావళిని ఐదు రోజుల పాటు జరుపుకుంటారు.

2 /8

దీపావళిని చాలా మంది ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారు. అదే విధంగా దీవాళితో పాటు, భాయ్ దూజ్ ను కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంతో వేడుకగా నిర్వహించుకుంటారు . ఈ సారి మనం నవంబర్ 3 న ఆదివారం రోజున భాయ్ దూజ్ ను జరుపుకోబోతున్నారం.

3 /8

భాయ్ దూజ్ పండగ కూడా అచ్చం రాఖీ పండగ మాదిరిగా జరుపుకుంటారు. అయితే.. ఇక్కడ రాఖీలు కట్టుకొవడం ఉండదు.  కానీ సోదరీ మణుల ఇంటికి వెళ్లి వారి చేతితో వండిన పదార్థాలను ప్రేమతో తినిపిస్తారు. ఆ తర్వాత తమ సోదరీమణులకు బహుమతులు ఇస్తారు.

4 /8

భాయ్ దూజ్, భాయి టికా, భౌబీజ్, భాయ్ బీజ్, భాయ్ ఫోంటా లేదా భ్రాత్రు ద్వితీయ అని కూడా పిలుస్తారు. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో ప్రకాశవంతమైన పక్షంలోని రెండవ రోజున జరుపుకునే హిందూ పండుగ. 

5 /8

ఇది దీపావళి వేడుకల్లో భాగం. భాయ్ దూజ్.. ఆదివారం రోజున.. మధ్యాహ్నం.. 1 గంటల నుంచి 3 వరకు సమయం బాగుంది.  అదే విధంగా సాయంత్రం 5 నుంచి 8 వరకు కూడా సోదరులు తమ అక్కలు, చెల్లెళ్ల ఇంటికి వెళ్లవచ్చు

6 /8

భాయ్ దూజ్ ను యమ ద్వితీయ, భౌబీజ్, భగీనీ హస్త భోజనం అని కూడా పిలుస్తుంటారు. భాయ్ దుజ్ వెనుక కొన్ని ఇతిహాసాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దుష్ట రాక్షసుడు నరకాసురుడిని ఓడించిన తరువాత, శ్రీకృష్ణుడు అతని సోదరి సుభద్రను వెళ్లి కలిసాడని, అప్పుడు నుదిటిపై తిలకం దిద్ది సుబద్ర స్వాగతం పలికిందంట.  

7 /8

అదే విధంగా యముడి సోదరి యమునకు అనేక కష్టాలు వేధిస్తుంటాయంట. దీంతో తన సోదరికి కలిసేందుకు యముడు ఒక రోజు యమున ఇంటికి వెళ్లగా.. అప్పుడు యమున తన సోదరుడికి ఇష్టమైన పదార్థాలను వండి పెడుతుందంట. ఆ తర్వాత  యముడు ఆశీర్వదించడంతో యమున కష్టాలన్ని దూరమైపోతాయంట.

8 /8

అప్పుడు యమునకు యముధర్మరాజు.. వరమిచ్చాడంట. ఎవరైతే.. దీపావళి తర్వాత వచ్చే యమద్వితీయ లేదా భాయ్ దూజ్ రోజు తమ సోదరి ఇంటికి వెళ్లి, ఆమె అతీథ్యం స్వీకరిస్తారో.. వాళ్ల సోదరీ మణులకు ఉన్న కష్టాలన్ని దూరమై ఆనందంతో ఉంటారని చెప్పాడంట. అప్పటి నుంచి అనాదీగా భాయ్ దూజ్ , యమద్వితీయను అందరు జరుపుకుంటూ వస్తున్నారు.