Actress Adah Sharma latest pics: ఆదా శర్మ.. ఈ పేరు వినగానే మనందరికీ.. హార్ట్ ఎటాక్ సినిమా గుర్తుకువస్తుంది. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ తరచూ సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులకు టచ్లో ఉంటుంది.
2008లో హిందీ సినిమా.. 1920 హరర్ మూవీతో ఆరంగ్రేటం చేసిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ కూడా ఇన్స్టా వేదిక ద్వారా ఫొటోలను పంచుకుంటూ అభిమానులకు అలరిస్తూ ఉంటుంది.
టాలీవుడ్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2014లో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాలో నితిన్ సరసన నటించి ఈ కేరళ బ్యూటీ నటించి అందరిని ఆకట్టుకుంది.
ఆ తరువాత ఆమె తెలుగులో ఐదు సినిమాల్లో నటించింది. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం సినిమాల్లో నటించింది.