8th Pay Commission: 8వ వేతన సంఘం ప్రకటనపై గుడ్‌న్యూస్, కనీస వేతనం ఎంత పెరగనుంది

దేశవ్యాప్తంగా కోటిమందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. ఇప్పుడు అందుకుంటున్న కనీస వేతనం కాస్తా రెట్టింపవుతుంది. అందుకే ఉద్యోగుల్లో 8వ వేతన సంఘం కోసం నిరీక్షణ ఉంది. 

8th Pay Commission Announcement News in Telugu: దేశవ్యాప్తంగా కోటిమందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. ఇప్పుడు అందుకుంటున్న కనీస వేతనం కాస్తా రెట్టింపవుతుంది. అందుకే ఉద్యోగుల్లో 8వ వేతన సంఘం కోసం నిరీక్షణ ఉంది. 

1 /5

ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో జీతభత్యాల పెంపు కోసం ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అందుకే 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 7వ వేతన సంఘం 2026 జనవరితో పూర్తి కానుంది. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల కనీస వేతనం భారీగా పెరగనుంది. 18 వేలున్న బేసిక్ శాలరీ 34,500 రూపాయలకు పెరుగుతుంది. 

2 /5

కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పాటు చేస్తుంటుంది. 2014లో ఏర్పడిన 7వ వేతన సంఘం 2016 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ వేతన సంఘం 2026 జనవరి వరకూ అమల్లో ఉంటుంది. అందుకే ఇప్పుడు కొత్త వేతన సంఘం ఏర్పాటు చేస్తే అమల్లోకి వచ్చేందుకు కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పడుతుంది

3 /5

అందుకే 8వ వేతన సంఘంపై వచ్చే ఏడాది అంటే 2025 ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న వేతన సంఘం అమల్లోకి వచ్చి జీతభత్యాలు, పెన్షన్ భారీగా పెరగనుంది. 

4 /5

7వ వేతన సంఘం ప్రకారం ఉద్యోగుల జీతం 23 శాతం పెరిగింది. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే కనీస వేతనం 18 వేల నుంచి 34,500 రూపాయలుకు పెరగనుంది. అంటే కనీస వేతనం దాదాపు రెట్టింపు అవుతుంది. ఎప్పుడైతే కనీస వేతనం పెరుగుతుందో దీని ఆధారంగా డీఏ కూడా భారీగా పెరగనుంది.

5 /5

7వ వేతన సంఘం ప్రకారం డియర్‌నెస్ అలవెన్స్ ఎంతనేది ఉంటుంది. కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ఇది ఉంటుంది. అయితే 8వ వేతన సంఘంలో డీఏ కూడా రివైజ్ అవుతుంది. అందుకే ఉద్యోగుల్లో పెద్దఎత్తున నిరీక్షణ ఉంది.