2025 Eclipses: 2025 సంవత్సరంలో సూర్య, చంద్రగహణాల తేదీలు ఇవే!

Solar And Lunar Eclipses In New Year 2025: కాలగర్భంలో ఒక సంవత్సరం ముగియనుండగా మరో కొత్త సంవత్సరం రానుంది. అయితే కొత్త సంవత్సరంలో ఏమేమి విశేషాలు ఉన్నాయనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో శాస్త్ర సాంకేతికపరంగా.. విశ్వాసాలపరంగా ముఖ్యమైన గ్రహాణాల గురించి తెలుసుకుందాం.

1 /6

శాస్త్ర సాంకేతికపరంగా.. కొన్ని వర్గాల విశ్వాసాలపరంగా గ్రహాణాలు అనేవి చాలా ముఖ్యమైనవి. 2025 సంవత్సరంలో ఎన్ని సూర్య, చంద్ర గ్రహణాలు ఉన్నాయో తెలుసుకుందాం.

2 /6

ఉజ్జయిని జీవాజీ అంతరిక్ష అధ్యయన కేంద్రం ప్రకారం.. కొత్త సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు ఉండగా.. వాటిలో రెండు చంద్ర గ్రహణాలు.. మరో రెండు సూర్య గ్రహణాలు ఉన్నాయి.

3 /6

మార్చి 14వ తేదీన సంపూర్ణ చంద్ర గ్రహణం ఉండనుంది. ఇది పగటి పూట ఏర్పడనుండడంతో భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించకపోవచ్చు.

4 /6

మార్చి 29వ తేదీన పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడనుంది. అయితే దీని ప్రభావం భారతదేశంలో ఉండదు.

5 /6

సెప్టెంబర్‌ 7-8 తేదీల మధ్యలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. భారతదేశంలో ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుంది.

6 /6

సెప్టెంబర్‌ 21-22 తేదీల మధ్యలో పాక్షిక సూర్య గ్రహణం ఉండనుంది. దీని ప్రభావం భారతదేశంలో ఉండదు.