Fastest Centuries in IPL: మెరుపు వేగంతో బాదిన ఐపీఎల్ శతకాలు ఇవే..

  • Oct 18, 2020, 17:04 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకాన్ని (fastest centuries in IPL history) విండీస్ విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్ తన పేరిట లిఖించుకున్నాడు. కేవలం 30 బంతుల్లో గేల్ ఈ శతకాన్ని సాధించాడు. యూసఫ్ పఠాన్, డేవిడ్ మిల్లర్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్‌లు ఫాస్టె్స్ట్ ఐపీఎల్ శతకం చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

1 /6

యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్ పూణే వారియర్స్‌పై చేసిన శతకం ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన శతకం. 30 బంతుల్లో శతకం బాదేశాడు. 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్సర్లు సాయంతో 175 పరుగులు చేశాడు.

2 /6

రాజస్థాన్ రాయల్స్‌కు ఆడే సమయంలో యూసఫ్ పఠాన్ ముంబై ఇండియన్స్‌పై 37 బంతుల్లో శతకం బాదేశాడు.

3 /6

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున ఆడుతూ డేవిడ్ మిల్లర్ ప్రత్యర్థి జట్టు ఆర్సీబీపై 38 బంతుల్లో ఐపీఎల్ సెంచరీ సాధించాడు. దీంతో 191 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే పంజాబ్ ఛేదించింది.

4 /6

దక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడే సమయంలో ఆడమ్ గిల్‌క్రిస్ట్ 42 బంతుల్లో సెంచరీ సాధించాడు.

5 /6

ఆర్సీబీ ప్లేయర్, విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ 43 బంతుల్లోనే గుజరాత్ లయన్స్ మీద శతకం బాదాడు.

6 /6

2017లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 43 బంతుల్లోనే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై సెంచరీ సాధించాడు.