TS DMHO Jobs Notifications 2025: ఎలాంటి పరీక్ష లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. వైద్య, ఆరోగ్య శాఖలో ఇటీవలే ఖాళీ అయిన కొన్ని పోస్టులను ఫిల్ చేయబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
TS DMHO Jobs Notifications 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్ తెలిపింది. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీ ఉన్న వివిధ రకాల పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఖాళీ ఉన్న పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. అయితే ఇందులో భాగంగా కొన్ని జిల్లాలకు సంబంధించిన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతూ ప్రత్యేకమైన నోటిఫికేషన్ అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణాలో వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన ఖాళీ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయబోతున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పోస్టులను వివిధ జిల్లాల్లో భర్తీ చేయనున్నారు.
ఇటీవలే విడుదలైన నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో నారాయణ పేట జిల్లా నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఇందులో మొత్తం 37 పోస్టులు ఖాళీ ఉన్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. ఈ ఉద్యోగాల భర్తీని కేవలం కాంట్రాక్ట్ సోర్స్ పద్ధతిలో చేయనున్నారు.
ఇక ఈ నోటిఫికేషన్లో వెల్లడించిన పోస్టుల వివరాల్లోకి వెళితే.. VCCMsతో పాటు జిల్లా డాటా మెనేజర్, స్టాప్ నర్స్, ANM, మెడికల్ ఆఫీసర్, ఇలా వివిధ రకాల పోస్టలను భర్తీ చేయనున్నారు. అయితే జీతాలు కూడా ఉద్యోగాలను బట్టీ అందించబోతున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ నోటిఫికేషన్‌కు అప్లై సంబంధించిన చివరి తేదిని కూడా వెల్లడించారు. ఈ పోస్టులను 08-03-2024లోపే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలిపారు. కనీస వయస్సు 18 సంవత్సరాలు కూడా ఉండాలని సూచించారు.
ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక వివరాల్లోకి వెళితే.. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని నోటిఫికేషన్లో వెల్లడించారు. అలాగే ఎస్సీ ,ఎస్టీ, బీసీతో పాటు ఈడబ్ల్యూఎస్ వయస్సు పరిమితిని కూడా కలిగి ఉంటారు. అలాగే దీనిని అప్లై చేసుకునేవారు తప్పకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.