Actor Rag Mayur Movies: రాగ్ మయూర్.. ఇటీవల తెలుగులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇటు సినిమాలు.. అటు వెబ్ సిరీస్‌లతో ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాడు. రీసెంట్‌గా సివరపల్లి అనే వెబ్ సిరీస్‌తో హీరో పాత్ర పోషించి మెప్పించగా.. అదే రోజు గాంధీ తాత చెట్టు మూవీ విలన్ రోల్‌లో అదరగొట్టాడు. ఇలా ఒకే రోజు హీరో, విలన్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన రాగ్ మయూర్ ది స్పెషల్‌గా మారిపోయాడు.
సినిమా బండి అనే మూవీతో ఇండస్ట్రీకి పరిచమయ్యాడు రాగ్ మయూర్. ఆ సినిమాలో కటింగ్ చేసుకునే అబ్బాయి రోల్‌లో ప్రేక్షకులను తెగ నవ్వించేశాడు.
ఆ తరువాత తరుణ్ భాస్కర్ రూపొందించిన కీడాకోలా మూవీలో లాయర్ పాత్రలో నటించి నవ్వులు పూయించాడు. సివరపల్లి వెబ్ సిరీస్‌తో మరోసారి మెప్పించాడు.
పంచాయత్ అనే హిందీ వెబ్ సిరీస్ ఆధారంగా సివరపల్లి వెబ్ సిరీస్‌ను రూపొందించారు. రీమేక్ వెబ్ సిరీస్ అయినా.. పూర్తిగా తెలుగు ఫ్లేవర్‌లో తెలంగాణలోని ఓ పల్లెటూరులో జరిగిన కథగా తెరకెక్కించారు. అమెరికా వెళదామనుకునే యువకుడు.. పంచాయతీ సెక్రటరీగా మారి పల్లెటూరుకు వెళితే ఎలా ఉంటుంది..? అనే కాన్సెప్ట్‌తో తీశారు. పంచాయతీ సెక్రటరీగా రాగ్ మయూర్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు.
ఓవైపు ఇష్ట లేని ఉద్యోగం.. మరోవైపు అమెరికా వెళ్లాలనే ప్రయత్నాలు.. గ్రామ ప్రజలతో రాగ్ మయూర్ మాటలు.. ప్రేక్షకులను బాగా మెప్పించాయి.
గాంధీ తాత చెట్టు మూవీలో ఇండస్ట్రియలిస్ట్ ఏజెంట్‌గా సతీష్ అనే పాత్రలో ఒదిగిపోయాడు. తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నా.. క్లైమాక్స్‌లో రాగ్ మయూర్ నటన ప్లస్ అయింది.
ఇలా ఒకే రోజు హీరోగా.. విలన్‌గా డిఫరెంట్ పాత్రలతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. త్వరలోనే మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2లో ఓ మూవీ చేస్తుండగా.. అనుపమ పరమేశ్వరన్ పరదా, గరివిడి లక్ష్మీ సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నాడు.