Asus Zenfone 12 Ultra Price In India: అసుస్ జెన్‌ఫోన్ (Zenfone) నుంచి మార్కెట్‌లో అద్భుతమైన మొబైల్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ కానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Asus Zenfone 12 Ultra Price In India: ప్రముఖ టెక్ కంపెనీ అసుస్ జెన్‌ఫోన్ (Zenfone) త్వరలోనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గ్లోబల్ మార్కెట్‌లో అసుస్ జెన్‌ఫోన్ (Zenfone)కి సంబంధించిన కొత్త మొబైల్‌ను ఫిబ్రవరి 6న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది Zenfone 12 Ultra స్మార్ట్‌ఫోన్ పేరుతో లాంచ్ కానుంది. అయితే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ను ఇంకా వెల్లడించలేదు.
ఈ ఆసుస్ జెన్‌ఫోన్ 12 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిజైన్‌తో లాంచ్ కాబోతోంది. అంతేకాకుండా ఇందులో AI-ఆధారిత ఫీచర్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే సాంసంగ్‌లో అందించిన ప్రత్యేకమైన రియల్-టైమ్ కాల్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ Asus Zenfone 12 Ultra స్మార్ట్‌ఫోన్ స్పెషల్ కెమెరా మాడ్యూల్ కూడా లభిస్తోంది. దీంతో పాటు 3.5mm ఆడియో జాక్ సెటప్‌ను కూడా అందిస్తోంది. ఇక ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌పై పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆండ్రాయిడ్ 15 ఫీచర్లు కూడా లభిస్తున్నాయి.
ముందుగా ఈ మొబైల్‌ను కంపెనీ కస్టమర్స్‌కి 16 GB ర్యామ్‌తో పరిచయం చేయనుంది. ఇందులో ప్రత్యేకమైన గేమింగ్-ఫోకస్డ్ ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇది 6.7-అంగుళాల AMOLED FHD+ డిస్ల్పేతో విడుదల కానుంది. ఈ డిస్ల్పే గేమింగ్ చేసేవారికి చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇక ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు అదనంగా 32-మెగాపిక్సెల్ (టెలిఫోటో) లెన్స్ కెమెరా సెన్సార్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన 13-మెగాపిక్సెల్ (అల్ట్రా-వైడ్) కెమెరా కూడా లభిస్తోంది.
ఈ Asus Zenfone 12 Ultra స్మార్ట్‌ఫోన్ 5,800mAh బ్యాటరీతో విడుదల కానుంది. దీంతో పాటు 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్ కూడా లభిస్తోంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కోసం కంపెనీ 65W వైర్డ్ ఛార్జ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఇందులో అనేక రకాల ప్రత్యేమైన కొత్త ఫీచర్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది.