Xiaomi 15 Ultra Leaked Features: మార్కెట్లోకి అతి త్వరలోనే Xiaomi 15 Ultra స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇటీవలే లీక్ అయ్యాయి. ఆ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Xiaomi 15 Ultra Leaked Features: షావోమీ (Xiaomi) నుంచి మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అత్యాధునిక ఫీచర్స్‌తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీనిని కంపెనీ మొదట 16GB ర్యామ్‌తో పాటు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో విడుదల చేయనుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
షావోమీ (Xiaomi) 15 Ultra మొబైల్ శక్తివంతమైన 6000mAh బ్యాటరీతో లాంచ్ కానుంది. అంతేకాకుండా Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది మల్టీ టాస్కింగ్ చేసేందుకు బాగా పని చేస్తుంది. దీని బ్యాక్ సెటప్‌లో 200MP పెరిస్కోప్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది.
అలాగే ఈ Xiaomi 15 Ultra స్మార్ట్‌ఫోన్ 2K AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే కంపెనీ దీనిని ఫిబ్రవరి నెలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రీమియం డిజైన్‌తో విడుదల కాబోతోంది. దీని మొదటి వేరియంట్ 512GB స్టోరేజ్‌తో లాంచ్ కానుంది.
ఈ శక్తివంతమైన Xiaomi 15 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ మైక్రో-క్వాడ్-కర్వ్డ్ డిజైన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది మూడు కలర్ ఆప్షన్స్‌లో విడుదల కానుంది. అంతేకాకుండా ఇందులో కంపెనీ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తోంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ 6.73 అంగుళాల AMOLED డిస్ప్లేతో విడుదల కానుంది. ఇది 2K రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది HyperOS 2.0పై రన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
Xiaomi 15 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ దీని ప్రధాన కెమెరా 200MP Samsung HP9 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుంది. ఇది 50MP Sony LYT 900 ప్రధాన సెన్సార్ కెమెరాతో విడుదల కాబోతోంది. అలాగే ఇది OIS సెన్సార్‌తో అందుబాటులోకి రానుంది.
Xiaomi 15 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. ఇది 6000mAh జంబో బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా దీనిని నాన్‌స్టాప్ వినియోగిస్తే దాదాపు 2 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. దీనిని ఛార్జ్ చేసేందుకు 100W వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది.