Anchor Anushree Net Worth: కన్నడ బుల్లితెర తన యాంకరింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది యాంకర్ అనుశ్రీ. త్వరలోనే ఈ శాండల్‌వుడ్ భామ పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతోంది. మార్చిలో తన పెళ్లి ఉంటుందని ఇప్పటికే ఈ 37 ఏళ్ల బ్యూటీ ప్రకటించింది. అయితే అనుశ్రీ ఆస్తుల విలువ ఎంత ఉంటుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఆన్లైన్లో వెతుకుతున్నారు.
గత పదేళ్లుగా కన్నడ బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తోంది అనుశ్రీ. తన మాటల గారడీతో ఇట్టే ఆకట్టుకోవడంతో ఈ భామకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అయితే 37 ఏళ్లు వచ్చినా ఇంకా వివాహం చేసుకోలేదు. అనుశ్రీ ఎక్కడికి వెళ్లినా పెళ్లి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఓ స్టార్ హీరోను సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నట్లు ప్రచారం జరిగినా.. అవన్నీ రూమర్లేనని తేలిపోయింది.
మార్చి నెలలో తాను పెళ్లి చేసుకోనున్నట్లు ఈ బ్యూటీ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక యాంకర్‌గానే కాకుండా ఆడియో ఫంక్షన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్స్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తూ అనుశ్రీ కాస్త గట్టిగానే సంపాదించినట్లు తెలుస్తోంది.
ఆమె ఒక్క ఎపిసోడ్‌కు దాదాపు రూ.లక్ష వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. పేదరికం నుంచి వచ్చిన అనుశ్రీ.. ఎన్నో కష్టాలను దాటుకుంటూ టాప్ యాంకర్‌గా ఎదిగింది.
ఆమెకు లగ్జరీ ఇల్లు, కారు ఉంది. ఈ బ్యూటీ ఆస్తుల విలువ దాదాపు రూ.50 కోట్లుగా ఉంటుందని శాండల్‌వుడ్‌లో టాక్.