EPFO News: ఈపీఎఫ్ లో పేరు పుట్టిన తేదీ వంటి తదితర వివరాలు మార్చుకోవడం ఇప్పుడు మరింత సులభతరం కానుంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
EPFO News: ద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ చందాదారుల పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను మార్చుకోవడాన్ని మరింత సులభం చేసింది. ఇకపై యాజమాని గాని ఈపీఎఫ్ ఆమోదం అవసరం లేకుండా ఆన్లైన్లోనే ఈజీగా మార్చుకునే వీలు కల్పించింది. ఈ కేవైసీ పూర్తి చేసిన ఈపీఎఫ్ఓ ఖాతాలను యజమాని జోక్యం లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకునే సదుపాయాన్ని కూడా అందులో అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్ సుక్ మాండవియ ఈ రెండు సేవలను శనివారం ప్రారంభించారు. వీటివల్ల ఈపీఎఫ్ఓ ప్రక్రియ మరింత సులభతరం కావడంతో పాటు యాజమాన్యాలపై పని ఒత్తిడి కూడా తగ్గుతుందని వెల్లడించారు.
ఈపీఎఫ్ఓ చందాదారులకు సంబంధించి వ్యక్తిగత వివరాలైన పేరు, పుట్టిన తేదీ, లింగం, జాతీయత, తల్లిదండ్రుల పేరు, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేరు, ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగం వీడిన తేదీ, వంటి వివరాల విషయంలో సాధారణంగా తప్పులు దొరుకుతుంటాయి, వీటిని మార్చుకోవడం పై మరింత సులభతరం కానుంది.
2017 అక్టోబర్ 1 తరువాత జారీ అయిన యుఎన్ఏ చందాదారులు ఈ కొత్త సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. వివరాలు మార్చుకునేందుకు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు అవసరం ఉండదు. 2017 అక్టోబర్ 1 ముందు జారీ అయిన యూనియన్ చందాదారుల విషయంలో ఈపీఎఫ్ ఆమోదం అవసరం లేకుండానే యాజమాన్యమే అవసరమైన మార్పులు చేయవచ్చు. ఇందుకు అవసరమైన సపోర్టింగ్ డాక్యుమెంట్లను సైతం తగ్గించినట్లు మంత్రి తెలిపారు.
ఆధార్ తో లింక్ చేయని యూఎన్ఏ ఖాతాల విషయంలో ఏవైనా మార్పులు చేయాల్సిన సందర్భంలో మాత్రం యాజమానానికి ఫిజికల్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. వారి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఈపీఎఫ్ ఆమోదం కోసం పంపించాల్సి ఉంటుంది.
ఉద్యోగంలో చేరిన సందర్భంలో ఆయా సంస్థలు పేర్లు, వైవాహిక స్థితి సర్వీసు వివరాలు నమోదు చేయడంలో తప్పులు చేస్తుంటాయి. ఈ కరెక్షన్లు సరి చేయడానికి ఉద్యోగులు ఆన్లైన్లో సంబంధిత డాక్యుమెంట్లతో రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఒకసారి యజమాని వెరిఫై చేసిన తర్వాత రిక్వెస్ట్ ఈపీఎఫ్ఓ ఆమోదం కోసం పంపిస్తారు. ఈ ప్రక్రియను జాయింట్ డిక్లరేషన్ గా పేర్కొంటారు.
ఒక 2024-25 ఈ సంవత్సరంలోనే 8 లక్షల రిక్వెస్ట్ లు వచ్చాయని మాండవియా తెలిపారు. తాజా నిర్ణయంతో 45% మందికి తక్షణమే ఊరట లభిస్తుందని మరో 50% కరెక్షన్లు యాజమాన్యం దగ్గర ఉన్నాయని పరిష్కారం కానున్నాయని తెలిపారు. ఇప్పటికే ఎవరైనా సభ్యుల అభ్యర్థనలు యాజమాని వద్ద పెండింగ్లో ఉంటే డిలీట్ చేసి కొత్త సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు అని ఆయన తెలిపారు
ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ ఖాతాను సులువుగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ కేవైసీ పూర్తి చేసిన చందాదారులు ఆధార్ ఓటిపి ఎంటర్ చేసి యజమాని చోక్యం లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని మాండవియా తెలిపారు.ఒకవేళ ఎవరైనా ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ప్రస్తుతం ఎంప్లాయర్ వద్ద పెండింగ్లో ఉంటే డిలీట్ చేసి నేరుగా ఈపీఓకే అభ్యర్థన పెట్టుకోవచ్చని వివరించారు.ఉద్యోగం మారిన సందర్భంలో ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అభ్యర్థులను ఈపీఎఫ్ కు చేరడానికి 12 నుంచి 13 రోజుల సమయం పడుతుందని మంత్రి తెలిపారు.ఖాతా నిర్ణయంతో గడువు తగ్గుతుందని తెలిపారు.బ్యాంకింగ్ వ్యవస్థతో సమానంగా ఈపీఎఫ్ఓ సేవలు అందించడమే లక్ష్యంగా అనేక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు.