Sukumar Daughter Shocking She Shave Head For Movie: పుష్ప సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ పొందిన దర్శకుడు సుకుమార్ కుమార్తె గుండు చేయించుకున్నదే వార్త ఆసక్తికరంగా మారింది. అతడి కుమార్తె గుండు చేయించుకోవడానికి గల కారణం ఏమిటా? అని ఆరా తీస్తున్నారు. అయితే కుమార్తె గుండు గీయించుకోవడంపై అతడి భార్య కన్నీళ్లు పెట్టేసుకుంది. ఇక్కడ పూర్తి వివరాలు...
తెలుగు టాప్ దర్శకుల్లో సుకుమార్ ఒకరు. పుష్ప 2తో ఏ దర్శకుడికి సాధ్యం కాని రికార్డులు సుకుమార్ సొంతం చేసుకున్నాడు. యావత్ భారత సినీ పరిశ్రమలోనే అత్యధిక కలెక్షన్లు పొందిన సినిమాగా పుష్ప 2: ది రూల్ రికార్డు పొందింది.
తాను దర్శకత్వం వహిస్తూనే నిర్మాతగాను మారారు. ఇప్పుడు తన ఇంట్లోనే ఓ నటిని బయటకు తీసుకువచ్చారు. సుకుమార్, తబితాల కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి నటిగా కెరీర్ ప్రారంభించింది.
పద్మ మల్లాడి దర్శకత్వంలో 'గాంధీ తాత చెట్టు' సినిమాను తెరకెక్కించగా ఇందులో ప్రధాన పాత్రలో సుకుమార్ కుమార్తె సుకృతి నటించింది. అయితే ఈ సినిమా కోసం సుకృతి ఎవరూ చేయని సాహస చేసి ఔరా అనిపించింది.
గాంధీ తాత చెట్టు సినిమా కోసం సుకృతి తన కేశాలను సమర్పించింది. 12-13 ఏళ్ల టేనేజ్లో సుకృతి గుండు చేయించుకోవడం సంచలనం రేపింది. గుండు చేయించుకుని సినిమాల పట్ల తనకు ఉన్న నిబద్ధతను సుకృతి చాటింది.
సినిమా కథలో కీలకమైన 'గుండు'ను సుకృతి చేయించుకోవడంపై ఆమె తల్లి.. సుకుమార్ సతీమణి బబితా స్పందించారు. తన కుమార్తె చేసిన సాహసంపై కన్నీటి పర్యంతమయ్యారు.
'టీనేజ్ వయసులో ఎవరూ కూడా గుండు చేసుకోరు. కానీ సుకృతి గుండు చేయించుకుంది' అని చెబుతూ బబితా కన్నీళ్లు పెట్టుకున్నారు. నటనలో రాణిస్తుందని అనుకోలేదని.. గాంధీ తాత చెట్టుతో నటిగా సుకృతి గుర్తింపు పొందిందని చెబుతూ బబితా ఆనందం వ్యక్తం చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్న గాంధీ తాత చెట్టు సినిమా జనవరి 24వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. పర్యావరణ పరిరక్షణ నేపథ్యం కలిగిన ఈ సినిమా ఇప్పటికే దాదాసాహెబ్ ఫాల్కే వంటి ప్రతిష్టాత్మక అవార్డులు పొందింది.
ఇప్పటికే తండ్రి సుకుమార్ తన సినిమాలతో రికార్డులు బద్దలు కొడుతుండగా.. ఆయన మాదిరి అతడి కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి తొలి సినిమాతోనే అవార్డులు కొల్లగొడుతుందని అందరూ భావిస్తున్నారు.