Tirumala: తిరుమలలో విషాదం.. గ్రిల్స్‌ నుంచి పడి మూడేళ్ల బాలుడు మృతి..!

Tirumala Tragedy 3 Years Old Dead: తిరుమలలో ఘోర విషాదం చోటు చేసుకుంది. దర్శనానికి వచ్చిన మూడేళ్ల బాలుడు మృతి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పద్మనాభ నిలయం భవనం రెండో అంతస్తు పైనుంచి కింద పడి మూడేళ్ల బాలుడు మరణించాడు. దీంతో ఆ ప్రదేశంలో విషాదఛాయలు అలుముకున్నాయి పూర్తి వివరాలు ఇవే..
 

1 /5

తిరుమలను నిత్యం వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. అలాగే కడపకు చెందిన ఓ కుటుంబం కూడా వచ్చింది కానీ, అనుకోని ఘటనతో ఘోర విషాదం చోటు చేసుకుంది. దర్శనానికి వచ్చిన కుటుంబానికి తీరని లోటు మిగిల్చింది. మూడేళ్ల బాలుడు పద్మనాభ నిలయ భవనం రెండో అంతస్తు గ్రిల్స్‌ నుంచి కింద పడి మరణించాడు. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది  

2 /5

శ్రీవారి దర్శనానికి వచ్చిన శ్రీనివాసులు కడపకు చెందినవారు. వారి కుటుంబానికి 16వ తేదీ దర్శనం టోకెన్లు జారీ చేశారు. దీంతో బుధవారం తిరుమల పైకి చేరుకుని అక్కడ లాకర్ తీసుకున్నారు. అక్కడ సముదాయం వద్ద  తన అన్నతో పాటు ఈ మూడేళ్ల బాలుడు సాత్విక్ ఆడుకుంటున్నాడు. ప్రమాదవ శాత్తు గ్రిల్స్‌ మధ్యలో నుంచి ఈ బాలుడు కింద పడిపోయాడు.   

3 /5

సాత్విక్ కింద పడటంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే సాత్విక్‌ను ఆసుపత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

4 /5

 ఇదిలా ఉండగా తిరుమల శ్రీవారి ఉత్తర ద్వారం దర్శనాలు జనవరి 10 నుంచి 19 తేదీ వరకు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనానికి అనుమతించడం లేదు.. వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో జారీ చేస్తున్నారు. అక్కడికి వెళ్లి తీసుకున్న వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు.  

5 /5

ఇక తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈనెల 8వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనలో  ఏడుగురు  చనిపోయారు. ఈ ఘటన మరువక ముందే మరో బాలుడి మృతి విషాదాన్ని మిగిల్చింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.