7th Pay Commission: ఉద్యోగులకు బేసిక్ పేలో భారీ పెంపు.. త్వరలో కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

7th Pay Commission Basic Pay Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పేకు గ్రాట్యుటీని కలిపితే శాలరీ ఒకేసారి భారీ మొత్తంలో పెరుగుతుంది. 2004లో గ్రాట్యూటీ మొత్తం 50 శాతం దాటిన తరువాత బేసిక్ పేతో లింక్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి గ్రాట్యూటీని బేసిక్‌ పేలో కలపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 

1 /8

గత నెలలో దీపావళి గిఫ్ట్‌గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3 శాతం డీఏ, డీఆర్ పెంచిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరింది.  

2 /8

ప్రస్తుతం డీఏ 50 శాతం దాటినా.. బేసిక్ పేతో లింక్ చేయకపోవడంతో ఉద్యోగుల్లో చర్చ మొదలైంది. గతంలో ఇలా చేయడంతో ఇప్పుడు కూడా చేస్తుందా అనే ఆశగా ఎదురుచూస్తున్నారు.  

3 /8

6వ వేతన సంఘం ప్రకారం.. డీఏ 50 శాతం దాటితే బేసిక్ పే కలిపి.. మళ్లీ జీరో నుంచి లెక్కించాలనే నిబంధన పెట్టారు. దీంతో 2004లో బేసిక్ పేలో కలిపారు.  

4 /8

అయితే 7వ వేతన సంఘంలో అలాంటి నిబంధన ఏమి లేదు. దీంతో డీఏ 53 శాతానికి చేరినా.. ప్రాథమిక వేతనంతో డీఏను లింక్ చేయలేదు.  

5 /8

బేసిక్‌ పేలో డీఏను కలిపితే భారీగా జీతాలు పెరగడంతోపాటు పెన్షన్‌లో పెంపు ఉంటుంది.   

6 /8

అంతేకాకుండా బేసిక్ పేపై ఆధారపడిన ఉద్యోగుల చెల్లింపులు, బోనస్, పెన్షన్, ఇతర అలవెన్సుల్లో కూడా పెంపు ఉండనుంది.  

7 /8

ఈ విషయంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ప్రస్తుతం సమీక్షిస్తున్నామని.. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఉద్యోగుల ప్రయోజాలను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.  

8 /8

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే రాసినది. జీతాల పెంపు, ఇతర సమాచారం కోసం ప్రభుత్వ వెబ్‌సైట్‌ను సందర్శించండి.