Latest Small Business Idea: ప్రస్తుతం చాలామంది తమదైన స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఫుడ్ బిజినెస్ మంచి డిమాండ్ ఉంది. దీనికి కారణం ఆహారం అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి. ఫుడ్ బిజినెస్ అనేది చాలా విస్తృతమైనది. ఇందులో స్నాక్స్, భోజనం, బేకరీ ఉత్పత్తులు, కేక్స్, ఇతర స్వీట్లు, ఆరోగ్యకరమైన ఆహారం, విదేశీ ఆహారం వంటి అనేక రకాలు ఉన్నాయి. తమకు నచ్చిన రంగంలో ప్రత్యేకత కనబరచడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు ఫూడ్ బిజినెస్ స్టార్ చేయాలని ఆలోచిస్తే ఈ బిజినెస్ మీకోసం.
నేటికాలంలో ప్రజలు ఆరోగ్యం పట్ల చాలా అవగాహనతో ఉన్నారు. ఆహారం, వ్యాయామం, నిద్ర, మానసిక స్థితి వంటి అంశాలన్నీ మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని ప్రతిఒకరు తెలుసుకున్నారు.
ముఖ్యం ఆహారం పట్ల సినీ తారల నుంచి ప్రతిఒక్కరు పలు జాగ్రత్తలను పాటిస్తున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుంచి రాత్రి భోజనం వరకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొనేందుకు మక్కువ చూపుతున్నారు.
ఫుడ్ బిజినెస్ స్టార్ చేయాలనుకుంటే మొలకలు మంచి ఎంపిన. ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని ప్రతరోజు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఈ మొలకలతో మీరు చిన్న బిజినెస్‌ను స్టార్ట్ చేయవచ్చు. దీని కోసం మీరు అతి తక్కువ పెట్టుబడితో చిన్న స్టాల్ ను ప్రారంభించవచ్చు. ఈ బిజినెస్ మరింత లాభాలు పొందాలంటే యోగా సెంటర్లు, ఫిట్ నెస్ సెంటర్ల వద్ద బిజినెస్ ప్రారంభించవచ్చు.
ఈ బిజినెస్‌తో ప్రతిరోజు రూ. 2 వేలు సంపాదించవచ్చు. దీని కోసం మీరు ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం లేదు. రోజుకు మూడు గంటల కూటాయిస్తే సరిపోతుంది.
ఏ బిజినెస్ అయిన ఉదయం 6 గంటల నుంచి 9 గంటలకు ప్రారంభించడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. ఎందుకంటే ఈ సమయంలో ఇతర షాపులు మూసి వేసి ఉంటాయి.
మీరు ఒక ప్లేట్ మొలకలకు రూ. 20 నుంచి రూ. 100 వరకు అమ్మవచ్చు. దీంతో రోజుకు రూ. 2 వేలు సంపాదించవచ్చు. నెలకు రూ. 60 వేలు సంపాదించొచ్చు.