Elon Musk : ట్రంప్ విజయం వెనుక ఎలాన్ మస్క్ వ్యూహం ఇదే.. అపర కుబేరుడు మస్క్ ఈ భూమిపైనే తొలి ట్రిలియనీర్ అవుతాడా

Elon Musk's Strategy Behind Trump's Victory: డోనాల్డ్ ట్రంప్ విజయం వెనుక ఎంతమంది ఉన్నప్పటికీ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సహాయం మాత్రం మరెవరు చేయలేదన్న సంగతి చెప్పుకోవచ్చు. ఒక దశలో పూర్తిగా పడిపోయిన ట్రంపు గ్రాఫ్ ను నిలబెట్టడంలో మస్క్ పడ్డ శ్రమ అంతా అంతా కాదని చెప్పవచ్చు. ట్రంప్ విజయం కోసం అసలు ఎలాన్ మాస్క్ ఎందుకు కష్టపడ్డాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
 

1 /7

Elon Musk's Strategy Behind Trump's Victory: అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ విజయం వెనుక ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మద్దతు తెలిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎలాన్ మస్క్ చెప్పవచ్చు. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో ట్రంప్ వెనుక వ్యూహ రచనలు చేయడంలో ఈ ప్రపంచ కుబేరుడు చాలా సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే, ట్రంప్ గత ఎన్నికల్లో ఓటమి అనంతరం, దాదాపు పతనావస్థకు చేరుకున్నారు. ఇక రాజకీయాల నుంచి కూడా వెనుదిరగాలని అనుకున్నారు. సరిగ్గా అలాంటి సమయంలోనే ఎలాన్ మస్క్ ముందుకు వచ్చి ట్రంప్ వెనక నిలబడ్డారు.   

2 /7

గత ఎన్నికల్లో ఓటమి అనంతరం డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ సైతం ఆ సంస్థ బ్లాక్ చేసింది. దీనితో ట్రంప్ చాలా అవమానంగా ఫీల్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడుగా ఉన్న తన అకౌంట్ సైతం ట్విట్టర్ బ్లాక్ చేయించడం ద్వారా డెమోక్రట్లు అమెరికా అధ్యక్ష పీఠంపై తమ పట్టును సాధించారు. ఇదిలా ఉంటే ట్రంప్ కోసం ఎలాన్ మస్క్ రంగంలోకి దిగి ఏకంగా ట్విట్టర్ ను సొంతం చేసుకున్నాడని, ఆయన అభిమానులు చెబుతూ ఉంటారు. ఇది పూర్తిగా నిజం కాకపోయినా, యాదృచ్ఛికంగా ఇలాంటిదే జరిగిందని చెప్పవచ్చు. 

3 /7

ఎందుకంటే ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత మళ్లీ  డోనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరించారు. అప్పటినుంచి  ట్రంప్ యమ యాక్టివ్ గా మారిపోయారు. దీనికి తోడు ట్రంప్ ప్రచార బాధ్యతను స్వయంగా ఎలాన్ మస్క్ తనపై వేసుకొని తన సొంత ఖాతా నుంచి జో బైడన్, కమలా హారిస్ ద్వయంపై ఎదురు దాడి చేశాడు. దీంతో అటు సోషల్ మీడియా వైపు నుంచి పెద్ద ఎత్తున ట్రంప్ కు మద్దతు లభించింది.   

4 /7

దీనికి తోడు ప్రచారం కోసం రిపబ్లికన్ పార్టీకి ఎలాన్ మస్క్ 75 మిలియన్ డాలర్ల విరాళం సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి ట్రంప్ విజయం సాధించడంతో  అటు ఎలాన్ మస్క్ కంపెనీల షేర్లు కూడా ఈరోజు భారీగా పెరిగాయి. టెస్లా కంపెనీ షేర్ ధర ఇంట్రాడేలో 14 శాతం పెరిగింది.   

5 /7

నిజానికి ఎలాన్ మస్క్ గత కొన్ని సంవత్సరాలుగా టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల ద్వారా విపరీతమైన లాభాలు పొందుతున్నారు. అయితే వ్యాపార వర్గాల్లో ఆయన పై ఉన్న ఒక ఆరోపణ ఏమిటంటే, ఎలాన్ మస్క్ ఆదాయంలో ఎక్కువ భాగం కార్బన్ క్రెడిట్స్ విక్రయించడం ద్వారా సంపాదిస్తాడని మార్కెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి.   

6 /7

దీనికి తోడు ఎలాన్ మస్క్ పెద్ద మొత్తంలో క్రిఫ్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టారని వీటన్నింటికీ అమెరికా ప్రభుత్వం మద్దతు అవసరమని భావించి ఆయన ట్రంప్ కు మద్దతుగా నిలుస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. నిజానికి ఎలాన్ మస్క్ ఆదాయంలో ఎక్కువ మొత్తం కార్ల వ్యాపారం కన్నా కూడా, ఇతర ఆదాయం ద్వారానే ఆయన ప్రపంచ కుబేరుడుగా నిలిచినట్టు పలు సందర్భాల్లో నిరూపితం అయింది. అయితే ఆ ఇతర ఆదాయ మార్గాల పైనే చాలా కాలంగా వివాదం నెలకొని ఉంది.   

7 /7

మరి ట్రంప్ జమానాలో ఎలాన్ మస్క్ ప్రపంచంలోని తొలి ట్రిలియనీర్ గా (1000 బిలియన్ డాలర్ల నెట్ వర్త్) అవతరిస్తాడా అంటే బహుశా అసాధ్యమైతే కాదు అని చాలామంది చెప్తున్నారు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ ఆస్తి విలువ బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం 260 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఎలాన్ మాస్క్ ప్రస్తుతం పెరుగుతున్న ఆస్తి విలువ 110% గా ఉంది. ఈ లెక్కన చూస్తే ఎలాన్ మస్క్ 2027 నాటికి తొలి ట్రిలియనీర్గా భూమిపై అవతరించే అవకాశం ఉందని అంచనాలు నిలబడుతున్నాయి.