8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్, 8వ వేతన సంఘం ఎప్పుడు, భారీగా జీతభత్యాల పెంపు, ఎప్పుడంటే

8th Pay Commission Updates in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలాకాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటుకై డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఈ మేరకు లేఖలు రాశాయి. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం విషయంలో నిర్ణయం తీసుకోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

8th Pay Commission News in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు, ఇతర అలవెన్సులు అవసరమైన మేరకు మార్పులు చేయడం, పెంచేందుకు సిఫార్సు చేయడం 8వ వేతన సంఘం ప్రధాన విధి. 1946లో తొలిసారిగా ఏర్పడిన వేతన సంఘం ఇప్పటికి 7 వేతన సంఘాలు అయ్యాయి. ఇక 8 వ వేతన సంఘం ఏర్పడితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92 శాతమైతే కనీస వేతనం ఏకంగా 18 వేల నుంచి 34,560 రూపాయలకు పెరగనుంది. 

1 /10

కేంద్ర  ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా పెన్షనర్లకు సైతం పెరుగుదల ఉంటుంది. రిటైర్ అయినవారికి కనీస పెన్షన్ 9 వేల నుంచి 17,280 వరకూ పెరగవచ్చు. ద్రవ్యోల్బణం ఇతర కారణాలతో ప్రభావితమైన ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్దఎత్తున ఉపశమనం కలగనుంది.

2 /10

జీతం ఎంత పెరుగుతుంది 8వ వేతన సంఘం ఏర్పడి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92 శాతంగా నిర్ణయిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం 18 వేల రూపాయల నుంచి 34,560 రూపాయలకు పెరుగుతుంది. అంటే 92 శాతం జీతం పెరుగుతుంది. 

3 /10

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాన్ని నిర్ణయించేది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. దీనిని 2.57 శాతం నుంచి 3.68 శాతానికి పెంచాలనేది ఉద్యోగుల డిమాండ్. ప్రభుత్వం దీనిని 1.92 శాతం పెంచవచ్చని అంచనా.

4 /10

పే మ్యాట్రిక్స్‌ను ఎప్పటికప్పుడు సవరించాలని 7 వ వేతన సంఘం సిఫార్సు చేసింది. దీనికోసం పదేళ్లు వేచి ఉండకూడదని తెలిపింది. నిజానికి 7వ వేతన సంఘం ఏర్పాటు తరువాతే ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు, ఆర్ధిక వ్యవస్థ, సేవల విషయంలో మార్పు వచ్చింది.

5 /10

వేతన సంఘం అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలు, పెన్షనర్ల పెన్షన్లు వంటి అంశాలతో పాటు ఇతర సౌకర్యాల కల్పనలో అవసరమైన మేరకు పెంచడంపై సిఫార్సు చేస్తుంటుంది. ఇప్పటి వరకూ ఇలా 7 వేతన సంఘాలు ఏర్పడ్డాయి. 

6 /10

సాధారణంగా వేతనం సఘం అనేది ప్రతి 10 ఏళ్లకోసారి ఏర్పడుతుంది. 2014లో ఏర్పడిన 7వ వేతన సంఘం సిఫార్లుసు 2016 నుంచి అమల్లోకి వచ్చాయి. అప్పట్లో ఉద్యోగుల జీతాలు 23 శాతం పెరిగాయి. ఇప్పుడు 10 ఏళ్లు పూర్తవుతోంది. అందుకే 8వ వేతన సంఘం ఏర్పడాలనే డిమాండ్ పెరుగుతోంది. 

7 /10

8వ వేతన సంఘాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే రెండు సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ప్రభుత్వం త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది. 

8 /10

ఈ నెలలో జరిగే జేసీఎం భేటీలో 8వ వేతన సంఘానికి సంబంధించి కీలకమైన అంశాలపై చర్చ జరగనుందని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు శివగోపాల్ మిశ్రా తెలిపారు. 

9 /10

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై చర్చించేందుకు ఇప్పటికే జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ ఏర్పడింది. ఈ సమావేశం ఈ నెలలో జరగనుంది. ఇందులో 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలకమైన చర్చలు జరగనున్నాయి.

10 /10

మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయుంటే ఈ ఆర్టికల్ మీ కోసమే. చాలాకాలంగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి కీలకమైన అప్‌డేట్స్ వెలువడ్డాయి. ఎప్పుడు ఏర్పడవచ్చు, ఏర్పడితే జీతభత్యాలు ఎంత పెరగనున్నాయనేది చెక్ చేద్దాం.