Pushpa 2 Release: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రిలీజ్.. బాహుబలిని మించి..

Pushpa 2 Release: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప2’ . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప పార్ట్ -1 ది రైస్’ మూవీకి కొనసాగింపుగా పుష్ప 2 చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను బాహుబలిని మించి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

1 /7

Pushpa 2 Release: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, టాలెంటెడ్  డైరెక్టర్‌ సుకుమార్‌ సంచలన కాంబినేషన్ లో రాబోయే నాల్గో చిత్రం ‘పుష్ప 2’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. పుష్ప మూవీ భారీ సక్సెస్ నేపథ్యంలో ‘పుష్ప 2’ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.

2 /7

పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ 1 హిందీ సహా అన్ని భాషల్లో భారీ సక్సెస్ నేపథ్యంలో పుష్ప 2 మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవి శంకర్ వై, సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్ తో భారీ నిర్మిస్తున్నారు.

3 /7

పుష్ప 2 మూవీపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి.  ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్‌తో పాటు ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.

4 /7

ముందుగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ సడెన్ గా ఒక రోజు ముందుగా డిసెంబరు 5న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు న నేషనల్‌ ప్రెస్‌మీట్‌లో తెలియజేశారు నిర్మాతలు.

5 /7

తాజాగా పుష్ప 2  చిత్రానికి సంబంధించిన మరో సన్సేషనల్‌ న్యూస్‌ను వెల్లడించారు మేకర్స్‌. పుష్ప-2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో కలిపి  11,500 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మన భారత దేశంలో 6500 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

6 /7

ఇక విదేశాల్లో.. ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్ లో  గ్రాండ్‌ విడుదలకు ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిపారు నిర్మాతలు. అయితే ఇది  బిగ్గెస్ట్‌ రిలీజ్‌ ఇండియన్‌ సినిమాగా ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

7 /7

ఇప్పటి వరకు ఏ భారతీయ‌ సినిమా కూడా ఇలాంటి ఘనత సాధించలేదని అంటున్నాయి ఇండియన్‌ ఫిల్మ్‌ సర్కిల్స్‌. ఇక పుష్ప-2 బాక్సాఫీస్‌ రోల్స్ లో  కలెక్షన్ల పరంగా బాక్సీఫీస్‌ వద్ద ఎన్నో సంచలనాలు సృష్టిస్తుందని అంటున్నారు ట్రేడ్‌ విశ్లేషకులు.