Wheat Dosa: బరువుని అదుపులో పెట్టే గోధుమ పిండి దోశ తయారీ విధానం..!

Wheat Dosa preparation : ఆరోగ్యానికి ఎంతో మంచిదైన గోధుమ పిండి దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం

1 /7

బరువుని  అదుపులో పెట్టే గోధుమ పిండి దోస తయారీ విధానం కోసం..ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి.

2 /7

అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని కూడా వేసుకొని..బాగా కలుపుకోవాలి.

3 /7

ఆ తర్వాత అందులో ఒక పెద్ద ఉల్లిపాయను..సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి.

4 /7

ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసుకుని  వేసుకోవాలి.

5 /7

అందులోనే రుచికి సరిపడా ఉప్పు, సోడా ఉప్పు వేసుకుని తగిన నీళ్లతో.. దోశ పిండి లాగా తయారు చేసుకోవాలి.

6 /7

స్టవ్ మీద పెనం పెట్టి.. అది వేడయ్యాక ఈ గోధుమపిండి మిశ్రమాన్ని దోసెల్లాగా పోసుకోవాలి.

7 /7

రెండు వైపులా.. గోధుమ రంగు వచ్చేవరకు కాల్చుకుంటే గోధుమపిండి దోశ రెడీ.