Jio New Recharge Plans: జియో రూ.1028 vs రూ.1029 రూపాయి తేడాతో ఈ రెండు రీఛార్జీ ప్యాకుల్లో ఎక్కువ లాభాలు ఎందులో తెలుసా?

Jio New Recharge Plans: మీరు జియో వినియోగదారులు అయితే మీకు ఒక బంపర్ ఆఫర్, రెండు సరికొత్త రీఛార్జ్ ప్యాక్‌లను జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్యాక్ లో మీరు 5జి డేటా స్పీడ్ పొందుతారు. తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్న ఈ రీఛార్జీ ప్లాన్స్‌ బెనిఫిట్స్‌ ఏంటో తెలుసుకుందాం.
 

1 /5

దిగ్గజ రిలయన్స్ జియో కంపెనీ రీఛార్జి ప్లాన్‌లను కస్టమర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. 2024 జూలైలో పెరిగిన టెలికాం ధరల తర్వాత కొత్త రీఛార్జ్ ప్లాన్లను అమలు చేస్తూ వస్తుంది. ముఖ్యంగా ఇందులో 5జి డేటా స్పీడ్ కూడా అందిస్తుంది. జియో తీసుకువచ్చిన రెండు సరికొత్త ప్లాన్లు రూ. 1028,రూ.1029 ఈ రెండు రీఛార్జ్ ప్లాన్ లో కళ్ళు చెదిరే ఆకర్షణీయమైన బెనిఫిట్స్ పొందుతారు.  

2 /5

జియో రూ. 1028 రీఛార్జ్ ప్లాన్.. రూ. 1028 రీఛార్జ్ ప్లాన్లో కస్టమర్‌లకు ఎన్నో అద్భుతమైన బెనిఫిట్స్ లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 84 రోజులు ఇందులో అపరిమిత కాలింగ్ పొందుతారు. వ్యాలిడిటీ పూర్తయ్యే వరకు ఫ్రీ కాలింగ్ సౌకర్యం కలదు. ప్రతిరోజు 2 జీబీ డేటా 4 జి స్పీడ్ తో పొందుతారు. అంటే 84 రోజులకు గాను 168 జిబి డేటా లభిస్తుంది.

3 /5

జియో 5జి కవరేజ్ ఉన్న ప్రాంతంలో 5జి డేటా స్పీడ్ పొందుతారు. అంతేకాదు రీఛార్జ్ ప్లాన్ లో ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. ఇంకా స్విగ్గి వన్ లైట్ కాంప్లిమెంటరీ  ఫ్రీ మెంబర్షిప్ యాక్సెస్ పొందుతారు. అదరనంగా జియో టీవీ, జియో సినిమా, కూడా ఉచితం.

4 /5

జియో  రూ.1029 రీఛార్జ్ ప్లాన్.. ఈ ప్లాన్ లో జియో కస్టమర్లు జియో రూ.1028 ప్లాన్‌లా అదే బెనిఫిట్స్‌ పొందుతారు. దీంట్లో ఏం పెద్ద తేడా లేదు. ఇందులో కూడా 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది,  ఫ్రీ కాలింగ్ సర్వీస్ ప్రతిరోజు 2gb డేటా 4 జి స్పీడ్ తో లభిస్తుంది. 5జి నెట్వర్క్ ఉన్న ప్రాంతంలో 5 స్పీడ్ నెట్ లభిస్తుంది.

5 /5

ఇంకా ఇందులో కూడా కస్టమర్లు మూడు నెలలుగా అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ పొందుతారు. అంతేకాదు జియో టీవీ, జియో సినిమా ,జియో క్లౌడ్ సర్వీస్ యాక్సెస్ కూడా ఉచితం. ఎక్కువ రోజులపాటు ఉచిత కాలింగ్ తో పాటు డేటా వినియోగించుకునే వరకు ఇది అద్భుతమైన ప్లాన్ కేవలం ఒక్క రూపాయి తేడాతో అయితే ఒకదాంట్లో స్విగ్గి వన్‌ లైట్‌ మెంబర్షిప్ ఇంకో దాంట్లో అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్షిప్ పొందుతారు. వినియోగదారుల వారి అవసరాలను బట్టి రీఛార్జ్ ప్లాన్ లో ఎంచుకోవచ్చు