Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి సంపాదన ఎంతో తెలుసా..! వామ్మో అన్ని లక్షలా..!

Youtuber Harsha Sai Networth: ఎంతోమంది పేదలకు సాయం చేస్తూ సోషల్ మీడియాలో భారీ క్రేజ్ సంపాదించుకున్న యూట్యూబర్ హర్షసాయి గురించి ప్రత్యేకంగా అవసరం లేదు. కష్టాల్లో ఉన్న వారికి సర్‌ప్రైజ్‌గా డబ్బును ఇస్తూ ఓ రేంజ్‌లో పాన్ ఇండియా యూట్యూబర్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. ఇటీవల హర్షసాయి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్స్‌ తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే హర్షసాయి నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..? అతని నెట్‌వర్త్ ఎంత..? అంత డబ్బు అతనికి నిజంగా యూట్యూబ్ నుంచి వస్తుందా..? ఇక్కడ తెలుసుకుందాం..
 

1 /8

యూట్యూబ్‌లో హర్షసాయి ఓ సెన్సేషన్. ఎవరు కష్టాల్లో ఉన్న వారిని తన టీమ్‌ను గుర్తించి.. వారిని ఊహించని విధంగా డబ్బును అందిస్తూ వారి సమస్యలను తీరుస్తున్నాడు.   

2 /8

పేదల కష్టాలను తీరుస్తుండడంతో లక్షల మంది హర్షసాయి యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారు.  

3 /8

విజయనగరానికి చెందిన హర్షసాయి.. మొదట సైన్స్‌తోపాటు ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలు చేసేవాడు. అలా మెల్లిగా ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ యూట్యూబ్‌లో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు.  

4 /8

ఓసారి ఫ్రీ పెట్రోల్ బంక్ ఓపెన్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ తరువాత పేదలను ఖరీదైన హోటల్స్‌కు తీసుకువెళ్లి ఫుడ్ పెట్టించడం.. గుడిసెల వద్దకు వెళ్లి వాళ్లు ఊహించనంత డబ్బును అందజేసి ఆదుకోవడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.  

5 /8

ఈ వీడియోలు తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయగా.. భారీగా వ్యూస్ వచ్చాయి. ఇలా తక్కువ కాలంలోనే మిగిలిన భాషల్లోనూ యూట్యూబ్ ఛానెల్స్‌ను ఓపెన్ చేసి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు.  

6 /8

5 రూపాయల కాయిన్స్‌తో 4 లక్షల రూపాయల కారును అందరినీ షాక్‌కు గురిచేశాడు. చిన్న చిన్న గేమ్స్‌ పెట్టి అటు ఆడే వాళ్లను.. ఇటు చూసే వాళ్లను ఎంతో థ్రిల్‌కు గురి చేస్తాడు.  

7 /8

హర్షసాయికి తన వాయిస్ ఎంతో ప్లస్. వీడియోలలో తన వాయిస్‌తో కంటెంట్‌ను పర్‌ఫెక్ట్‌గా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరిస్తాడు.    

8 /8

హర్షసాయి యూట్యూబ్‌ ఛానెల్స్‌ను దాదాపు 30 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం అతని ఆస్తి విలువ రూ.20 కోట్లు నుంచి రూ.22 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నెలకు రూ.25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.