Actor Sarath Babu Assets Value How Much And Who Takes His Assets: గతేడాది మృతి చెందిన సినీ నటుడు శరత్ బాబు ఆస్తుల అంశం తెరపైకి వచ్చింది. రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న ఆయనకు సంతానం లేదు. దక్షిణాదిలో అగ్రనటుడిగా ఉన్న శరత్ బాబు సంపాదించిన ఆస్తులకు వారసుడు ఎవరు? అతడి ఆస్తులు ఎవరికి అనేది స్పష్టత వచ్చింది.
Sarath Babu Assets: ఒక్క కన్నడ, తెలుగులోనే కాదు దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా శరత్‌బాబు రాణించారు. తమిళం, తెలుగు, కన్నడ, మళయాలం, హిందీ చిత్రాలతో ఆయన స్టార్డం సంపాదించారు. దాదాపు 200 కంటే ఎక్కువ సినిమాలు చేశారు.
Sarath Babu Assets: తమిళంలో ఎక్కువ గుర్తింపు పొందడంతో శరత్ బాబు చెన్నైలో స్థిరపడ్డారు. మరణించే వరకు శరత్ బాబు చెన్నైలోనే గడిపారు. పరిశ్రమలో శరత్ బాబుకు ఆత్మీయ స్నేహితుడు ఎవరంటే సూపర్ స్టార్ రజనీకాంత్. వీరిద్దరూ కలిసి నటించిన ముత్తు సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
Sarath Babu Assets: నటుడు శరత్ బాబు 1971లో రమాప్రభను వివాహం చేసుకున్నారు. కానీ వీరి వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. వీరిద్దరూ 1988లో విడాకులు తీసుకున్నారు. రమాప్రభ మొదట హీరోయిన్గా.. అనంతరం హాస్య నటిగా, హీరోహీరోయిన్లకు బామ్మగా తదితర పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళంతోపాటు అనేక భాషలలో 300కి పైగా సినిమాల్లో నటించారు.
Sarath Babu Assets: రమాప్రభతో బంధం తెగిన తర్వాత ఎంఎన్ నంబియార్ కుమార్తె స్నేహలతా దీక్షిత్‌ను శరత్‌బాబు వివాహం చేసుకున్నారు. 2011లో స్నేహలతతో శరత్‌బాబు విడాకులు తీసుకున్నారు. రెండు పెళ్లిళ్లు చేసుకున్నా శరత్ బాబుకు వారసులు లేకపోవడం గమనార్హం.
Sarath Babu Assets: జీవితం చివరి దశలో శరత్ బాబు అరుదైన సెప్సిస్ వ్యాధితో బాధపడ్డారు. అదే వ్యాధితో బాధపడుతూ గతేడాది మే 22వ తేదీన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈఅయితే వారసులు లేకపోవడంతో శరత్ బాబు ఆస్తుల విషయమై చర్చ జరుగుతోంది.
Sarath Babu Assets: దక్షిణాదిలో స్టార్ నటుడిగా కొనసాగిన శరత్ బాబుకు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఇళ్లు, మాల్స్, అపార్ట్మెంట్లు, విల్లాలు, కంపెనీలు ఇలా ఎన్నో ఆస్తులను కలిగి ఉన్నాడు. ఇలా రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల మేర ఆస్తుల విలువ ఉంటుందని సమాచారం.
Sarath Babu Assets: తనకు సంతానం లేకపోవడంతో ఈ ఆస్తిని తన అన్నదమ్ముల పిల్లలకు రాసిచ్చాడని తెలుస్తోంది. శరత్ బాబు ఆస్తుల విషయమై అతడి సోదరుడు స్పందించారు. 'శరత్ బాబు మమ్మల్ని తండ్రిలా చూసుకున్నాడు. మేము అందరం కలిసే ఉన్నాం. అతను తన ఆస్తిలో ఏదైనా ఎవరికైనా రాసిచ్చాడో లేదో మాకు తెలియదు. ఏదైనా వీలునామా రాసి ఉంటే మాకెలాంటి ఇబ్బంది లేదు. లేకుంటే ఆస్తి మా కుటుంబసభ్యులం పంచుకుంటాం. ఇది మా కుటుంబ సభ్యుల వ్యక్తిగత విషయం. ఎవరూ ఆయన ఆస్తుల గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు' అని శరత్ బాబు సోదరుడు స్పష్టం చేశారు.