7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు..!

7th Pay Commission DA Hike Latest News: ఈ ఏడాది జనవరిలో డీఏ 4 శాతం పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. దీంతో కొన్ని రకాల అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు కూడా పెంచాల్సి ఉంది. దాదాపు  13 రకాల అలవెన్సులు 25 శాతం మేర పెరగాల్సి ఉందని ఇటీవల పలు నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం జూలై 4న ఓ సర్క్యూలర్ జారీ చేసింది. అందులో ఏ ముందంటే..?
 

1 /7

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ గతంలో జారీ చేసిన ఉత్తర్వులపై దృష్టి సారించినట్లు సర్క్యూలర్‌లో పేర్కొన్నారు. డీఏ 4 శాతం పెరగడంతో 50 శాతానికి చేరుకుందని.. దీని ప్రకారం వర్తించే అలవెన్సుల చెల్లింపులు ప్రస్తుతం ఉన్న ధరల కంటే 25 శాతం పెంచిన రేట్లలో చెల్లించవచ్చని తెలిపారు.   

2 /7

ఇంటి అద్దె అలవెన్స్ (HRA), టఫ్ లొకేషన్ అలెవెన్స్ (TLA), రవాణా భత్యం, వికలాంగ మహిళల పిల్లలకు ప్రత్యేక భత్యం, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ పెంచాల్సి ఉంది.  

3 /7

హెఆర్‌ఏ 25 శాతం పెరగడంతోపాటు హాస్టల్ అకామడేషన్, సిటీ లోపలి ట్రావెల్ ఛార్జీల రీఎంబర్స్‌మెంట్, ఫుడ్ ఖర్చులు, డైలీ అలవెన్సులు, ఓన్ కారు, ట్యాక్సీ ఉంటే వాటి ఛార్జీలు వంటివి కూడా పెంచనున్నారు.   

4 /7

టఫ్ లొకేషన్ అలెవెన్స్ కింద స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్, సందర్బాన్ అలవెన్స్, ట్రైబల్ ఏరియా అలవెన్స్ అని మూడు రకాలుగా చెల్లించనుంది. ఆయా ప్రాంతాలను బట్టి నెలకు రూ.1000 నుంచి రూ.5300 వరకు కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది.   

5 /7

వికలాంగ మహిళా ఉద్యోగుణుల చిన్న పిల్లలకు స్పెషల్ చైల్డ్ కేర్ అలవెన్స్ కింద నెలకు రూ.3 వేలకు చెల్లిస్తోంది. పిల్లలకు రెండేళ్లు వచ్చే వరకు ఈ అలెవెన్స్ అందిస్తోంది. ఇది 25 శాతం పెంచి చెల్లించనున్నారు.  

6 /7

చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల చదువుల కోసం అయ్యే ఖర్చులను కేంద్రం చెల్లిస్తుంది. ఇద్దరు పిల్లలకు హాస్టల్ ఫీజు సబ్సిడీ కింద నెలకు రూ.6750 పొందవచ్చు. దివ్యాంగ పిల్లలు అయితే.. రెండింతలు అంటే నెలకు రూ.4500 వరకు అందిస్తోంది. డీఏ 50 శాతం చేరడంతో 25 శాతం పెరుగుతుంది.  

7 /7

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.