Water Supply to be Disrupted in Hyderabad: హైదరాబాద్ నగర ప్రజలకు ముఖ్య గమనిక. నగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2లోని కోదండాపూర్ పంప్ హౌజ్‌లో రెండో పంపు NRV వాల్వ్ మరమ్మతులకు గురైంది. దీంతో అత్యవసరంగా నీటి సరఫరా నిలిపివేసే పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు. అదే సమయంలో అటు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు కూడా జరుగుతున్నాయని చెప్పారు. పనులు పూర్తయిన వెంటనే యథావిధిగా నీటి సరఫరా పునరుద్ధరించనున్నట్లు వెల్లడించారు.
ఈ మరమ్మతుల పనుల కారణంగా జలమండలి ఓ అండ్ ఎం డివిజన్లు- 2, 3, 4, 5, 7, 9, 10(A), 10(B), 13, 14, 16, 20 పరిధిలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు తాగునీటి సరఫరాలో కొన్నిచోట్ల పూర్తి అంతరాయం, కొన్నిచోట్ల పాక్షిక అంతరాయం ఏర్పడుతుందన్నారు. మరి కొన్నిప్రాంతాల్లో లో ప్రెజర్‌తో నీరు సరఫరా అవుతుందన్నారు.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
NPA, మిరాలం, బాలాపూర్, మైసారం, బార్కాస్ భోజగుట్ట, ఆళ్లబండ, మేకలమండి, భోలక్ పూర్, చిలకల గూడ, తార్నాక, లాలాపేట్, బౌద్ధ నగర్, మారేడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, MES, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్, పాటిగడ్డ, హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్, వైశాలి నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కపురి కాలనీ, మహీంద్రహిల్స్, ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కా నగర్, బీరప్పగడ్డ, బుద్వేల్, శాస్త్రిపురం, మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు కోరారు.
Also Read: Pinnelli Arrested: వైసీపీకి వరుస షాకులు.. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి