Guvva Gorinka Serial: సమాజంపై సినిమాల, సీరియల్స్ ప్రభావం కాస్త గట్టిగానే ఉంటుంది. చాలా మంది అందులో విషయాలను చూసి మారిపోయారు. కొందరు తమ అభిమాన హీరోలు సినిమాల్లో స్టైల్‌ను అనుకరిస్తే.. మరికొందరు వాళ్లు ఇచ్చే మెసేజ్‌ను స్పూర్తిగా తీసుకుంటారు. అందుకే మేకర్స్ కూడా తమ తీసే సినిమాలు, సీరియల్స్‌లో ఎక్కువగా మంచి మెసేజ్ ఇస్తే.. సమాజంలో కొంత మార్పులు ఉంటాయని భావిస్తుంటారు. మహేష్ బాబు శ్రీమంతుడు మూవీ తరువాత గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం మొదలైంది. మహర్షి సినిమా తరువాత వీకెండ్ ఫార్మింగ్ కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. ఇటీవల బాలయ్య భగవంత్ కేసరి మూవీలో గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ సీన్ ఎంతో ఆదర్శంగా నిలిచింది.
బాలయ్య వంటి పెద్ద నటుడు ఆ సీన్ చేయడంతో గుడ్ అండ్ బ్యాడ్ టచ్‌పై ఎక్కుగా చర్చలు జరిగాయి. సమాజంలో ఆడపిల్లలపై ఆకృత్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య తేడాలను తల్లిదండ్రులు తమ పిల్లలకు కచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అన్యం పుణ్యం ఎరుగని పసి పిల్లలపై కామంధులు వికృత చేష్టలకు పాల్పడకుండా అవగాహన కల్పించాలి. ఇదే విషయాన్ని భగవంత్ కేసరి మూవీలో బాలయ్య ఎంతో చక్కగా వివరించారు.
ఇప్పుడు ఇదే బాటలో ఓ సీరియల్ టీమ్ కూడా స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తోంది. చిన్న పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో గువ్వా గోరింక టీమ్ ప్రత్యేకంగా ఎపిసోడ్ డిజైన్ చేస్తోంది. టీవీ సీరియల్స్ అనేవి కేవలం వినోదం కోసమే కాదని.. వాటి ద్వారా సామాజిక సేవ చేయాలనే మహోన్నత సందేశాన్ని అందిస్తోంది. ఏ వ్యక్తి ఏ ఉద్దేశంతో టచ్ చేస్తున్నాడో ఎలా తెలుసుకోవాలో ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులకు అవగాహన కల్పిస్తారు. ప్రతి చిన్నారికి ఈ సందేశం చేరేలా చూడాలని సీరియల్ టీమ్ కోరుతోంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ గువ్వా గోరింక సీరియల్లో త్వరలో టెలికాస్ట్ కానుంది.
ఇటీవల సీరియల్స్‌ను చూసే వారి సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటోంది. ఎక్కువగా మహిళా మణులు సీరియల్స్‌ను ఆదరిస్తున్నారు. ఇలాంటి అవగాహన కల్పించే అంశాలతో ఉన్న స్పెషల్ ఎపిసోడ్స్‌ను చూసి.. వారిలోనూ ఆలోచనలు కలగవచ్చు. తమ ఇంట్లో పిల్లలకు కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించ అవకాశం ఉంటుంది. కొన్ని స్కూల్స్‌లోనూ గుడ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీరు కూడా ఈ విషయాలపై అందరికీ అవగాహన కల్పించండి. కామంధుల వికృత చేష్టల నుంచి చిన్నారులను రక్షించుకుందాం.
Also Read: Anaparthi Seat: అనపర్తి అసమ్మతిపై చంద్రబాబు దిగొచ్చినట్టేనా, సీటు మార్చే ఆలోచన
Also Read: Save The Tigers 2: బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్.. ఇండియా టాప్ 3 లిస్టులో ‘సేవ్ ది టైగర్స్’
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook