Holi 2024: కెమికల్స్ రహిత హోలి రంగులు ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి

హోలి వచ్చేస్తోంది. జనాన్ని రంగుల్లో ముంచెత్తే రంగవల్లుల హోలి మార్చ్ 25న ఉంది. మార్కెట్‌లో హోలి రంగుల విక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఈ రంగులన్నీ కెమికల్స్ నిండి ఉండేవి కావడంతో దుష్పరిణామాలు ఎక్కువ. మరి కెమికల్స్ లేని హోలి రంగుల్లో ఇంట్లో తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం..

Holi 2024: హోలి వచ్చేస్తోంది. జనాన్ని రంగుల్లో ముంచెత్తే రంగవల్లుల హోలి మార్చ్ 25న ఉంది. మార్కెట్‌లో హోలి రంగుల విక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఈ రంగులన్నీ కెమికల్స్ నిండి ఉండేవి కావడంతో దుష్పరిణామాలు ఎక్కువ. మరి కెమికల్స్ లేని హోలి రంగుల్లో ఇంట్లో తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం..

1 /5

నీలి రంగు సహజసిద్దమైన నీలి రంగు తయారీ కొద్దిగా కష్టమే. బ్లూ మందారం పూలు వినియోగించవచ్చు. వీటిని ఎండలో బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. 

2 /5

గులాబీ రంగు బీట్‌రూట్ రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపితే గులాబీ రంగు తయారైనట్టే. బీట్‌రూట్ రసం పెంచడం లేదా తగ్గించడం ద్వారా కలర్ బ్రైట్‌నెస్ పెంచుకోవడమో లేక తగ్గించుకోవడమో చేయవచ్చు.

3 /5

ఆకుపచ్చ రంగు దీనికోసం ముందుగా పాలకూర లేదా మెంతి కూర ఆకుల్ని తీసుకోవాలి. ఈ ఆకుల్ని పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా బియ్యం పిండి కలిపితే చాలు ఆకుపచ్చ రంగు సిద్ధం. ఎండిన వేపాకుల పౌడర్‌‌లో చందనం పౌడర్ కలిపి కూడా ఆకుపచ్చ రంగు తయారు చేసుకోవచ్చు.

4 /5

పసుపు రంగు పసుపు రంగు కోసం ముందుగా పసుపు చిన్న గిన్నెలో తీసుకోవాలి. అందులో కొద్దిగా పచ్చి మామిడి పేస్ట్ కలపవచ్చు. 

5 /5

ఎరుపు రంగు ముందుగా మందారం పూలు బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా బియ్యం పిండి, ఎర్రటి సింధూరం కలిపితే చాలు ఆకర్షణీయమైన, ఆరోగ్యకరమైన ఎర్ర రంగు తయారైపోతుంది. బీట్‌రూట్ రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి లిక్విడ్ రోజ్ వాటర్ సిద్ధమౌతుంది.