Happy Valentine's Day 2024: ఈ పొలిటికల్ లీడర్స్ లవ్ స్టోరీ తెలిస్తే వావ్ అంటారు..

Happy Valentine's Day 2024: ప్రతిసంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికులరోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అయితే, సాధారణంగా ఎక్కువగా బిజీగా ఉండే పొలిటికల్ లీడర్స్ లవ్ లైఫ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
 

1 /5

Happy Valentine's Day 2024: ప్రతిసంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికులరోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అయితే,  ఈ సందర్భంగా సాధారణంగా ఎక్కువగా బిజీగా ఉండే పొలిటికల్ లీడర్స్ లవ్ లైఫ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.  

2 /5

సీఎం రేవంత్ రెడ్డి- గీతారెడ్డి.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం గురించి అందరికీ తెలిసిందే. వీరిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. అనుముల రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ ఉందని మీకు తెలుసా? తాను చదువుకునే రోజుల్లోనే గీతరెడ్డిని పెళ్లి చేసుకునన్నారు. ఇరువైపులా పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. నాగర్జునసాగర్ వద్ద వీళ్లు మొదటిసారి కలుసుకన్నారు. ఆతర్వాత రేవంత్ రెడ్డి గీతరెడ్డికి ప్రపోజ్ చేశారట. 1992 లో వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. మొదట్టో వీళ్ల పెళ్లికి ఒప్పుకోలేదు. పై చదువుల కోసం ఢిల్లీలోని గీతరెడ్డి పెదనాన్న జైపాల్ రెడ్డి ఇంటికి వెళ్లారట. ఆ తర్వాత రేవంత్ అందరికీ నచ్చడంతో ఇరువురికి పెళ్లిచేశారు.

3 /5

భట్టివిక్రమార్క-నందిని.. ప్రేమికుల రోజు సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. గుజరాతీ ఫ్యామిలీకి చెందిన ఆయన సతీమణి నందిని మల్లు హైదరాబాద్ లో సెట్టిల్ అయ్యారు. సెంట్రల్ యూనివర్శిటీలో పరిచయం ప్రేమకు దారి తీసింది. రెండు కుటుంబాలను ఒప్పించి 1995 హైదరాబాద్ లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు.

4 /5

దామోదర రాజనర్హింహా-పద్మిని.. మంత్రులు దామోదర రాజనర్హింహా కూడా ప్రేమ వివాహాం చేసుకున్నారట. పెద్దలను సైతం ఎదిరించి ప్రేమ వివాహాం చేసుకున్నారు..అప్పట్లో పద్మిని బీజీపీలో జాయిన్ అవ్వడం సంచలనం సృష్టించింది. అంతేకాదు ఆధ్యాత్మిక మార్గం అంటే మక్కువ. 

5 /5

కొండా సురేఖ- మురళి.. కొండా సురేఖ, మురళిగారిది కూడా ప్రేమ వివాహామే. సురేఖగారిని బస్సులో ఫాలో అయ్యేవరట కొండా మురళి. ఒకరోజు నేరుగా పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశారట. ఆ తర్వాత సినిమాలు, షికార్లు చేసి లవ్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన కొన్ని రోజులకు తిరుపతిలో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు.