Monthly Income Scheme: ప్రస్తుతం సరైన రంగంలో పెట్టుబడి పెడితేనే భవిష్యత్తులో మన అవసరాలకు చేతికి అందివస్తాయి. ఇలాంటి పెట్టుబడులు పెట్టి రాబోయే కాలంలో వాటి ప్రతిఫలాలను దక్కించుకోవడం వల్ల జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది. మనం పని చేసేంత కాలం వరకు జీతంతో బతుకునీడ్చినా.. రిటైర్ అయిన తర్వాత నెలవారీ ఆదాయం అందడం అందరికీ కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో మనం రిటైర్డ్ అయ్యాక కూడా నెలవారీ ఆదాయం వచ్చే పథకానికి కొన్ని సరైన ఎంపికలు ఉన్నాయి. అలా నెలవారీ ఆదాయం కోసం మీరు భరోసా కలిగిన పెట్టుబడి వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అలాంటి నెలవరీ ఆదాయపు ప్లాన్స్ ఏం అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ICICI ప్రుడెన్షియల్ గిఫ్ట్- రేపటి ఆదాయం హామీ
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ICICI బ్యాంక్ కు చెందిన జీవిత బీమా కంపెనీ ICICI ప్రుడెన్షియల్. GIFT అనే రేపటికి గ్యారెంటీడ్ ఇన్కమ్ అనే ప్లాన్‌ను అమలు చేస్తుంది. ఇదొక పొదుపు జీవిత బీమా పథకం. ఈ పథకం నెలవారీ ఆదాయంతో పాటు రక్షణను కూడా అందిస్తుంది. దీని ద్వారా అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
దీని ప్రయోజనాలు ఏమిటి?
ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ గిఫ్ట్ ప్లాన్ వల్ల సాధారణ నెలవారీ ఆదాయం లేదా ఏకమొత్తం రూపంలో ప్రయోజనాలను పొందవచ్చు. పెట్టుబడి పెట్టిన రెండో ఏడాది నుంచి గ్యారెంటీ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. పురుషులతో మహిళా పెట్టుబడిదారులకు ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. జీవిత బీమా కవరేజ్ అందుబాటులో ఉంది. మీరు కోరుకున్న తేదీ నుంచి నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు. దీంతో పాటు మీ పాలసీపై రుణాన్ని కూడా తీసుకోవచ్చు. అయితే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మీరు చెల్లించిన ప్రీమియంపై ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉంది.
Also Read: India Canada News: ఢిల్లీలో కెనడా దౌత్యవేత్తలకు కేంద్రం కీలక ప్రకటన..ఏం జరిగిందంటే?
పాలసీ ప్రత్యేక లక్షణాలు
ఈ ప్లాన్ కింద మీరు 6, 7, 8, 10, 12 ఏళ్లు (+1 సంవత్సరం) ప్రీమియం చెల్లించవచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన రెండో ఏడాది నుంచి ఆదాయాన్ని పొందుతారు. ఒకవేళ మీరు డబ్బు మొత్తాన్ని ఏకరూపంలో తీసుకునేందుకు కూడా అవకాశం ఉంది.
మీకు ఎంత రాబడి వస్తుంది?
ఐసీఐసీఐ వెబ్సైట్ ప్రకారం.. మీరు ఈ పథకంలో ఒక సంవత్సరంలో లక్ష రూపాయలు డిపాజిట్ చేసి, ఆరేళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే రెండవ ఏడాది నుంచి ఏడో సంవత్సరం వరకు మీకు రూ.15,000 లభిస్తుంది. 7 ఏళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య మీరు రూ. 1,15,386 పొందుతారు. ఏడేళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే రెండో ఏడాది నుంచి 8వ ఏడాది వరకు రూ. 20 వేలు.. ఎనిమిదో ఏడాది నుంచి 14వ ఏడాది వరకు రూ. 1,18,455 ఆదాయం లభిస్తుంది. ఇలా నెలవారీ కాకుండా అత్యవసర పరిస్థితుల్లో పాలసీ వ్యవధి ముగిసిన తర్వాత ఆదాయాన్ని ఏకమొత్తంలో పొందవచ్చు.
Also Read: మొటిమలు, మచ్చలను తగ్గించి.. యవ్వనంగా కనిపించేలా చేసే హోమ్ మేడ్ మిశ్రమం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook