Fake News on Sarath Babu Death: తమిళ సినీ పరిశ్రమలో ఈరోజు తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమకు చెందిన నటుడు, దర్శకుడు అయిన మనోబాల అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. అయితే మరో ప్రముఖ నటుడు శరత్ బాబు కూడా సినీ ప్రేక్షకులందరికీ విషాదంలోకి నెట్టి కన్నుమూసినట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతానికి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. నిజానికి శరత్ బాబు ముందుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు తర్వాత అక్కడ మెరుగు కాకపోవడంతో అక్కడి నుంచి హైదరాబాదులోని ఏఐజీ హాస్పిటల్ కి తరలించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని ఆయనను ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. అయితే అప్పటి నుంచి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి వార్తలు లేవు కానీ ఈరోజు సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని ప్రచారం మొదలైంది.
Also Read: Samantha Tattoos:చైతూతో విడిపోయినా దాన్ని వదలని సమంత..అలా బయట పడిందిగా!
అయితే ఈ విషయం మీద డాక్టర్లు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇక శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన సోదరి సమాచారాన్ని మీడియాతో షేర్ చేశారు. సోషల్ మీడియాలో శరత్ బాబు గారి గురించి వచ్చే వార్తలన్నీ తప్పుగా వస్తున్నాయని శరత్ బాబు గారికి కొంచెం రికవరీ అయిందని దీంతో వెంటనే రూమ్ కి షిఫ్ట్ చేశామని ఆమె చెప్పుకొచ్చారు. త్వరలోనే శరత్ బాబు పూర్తిస్థాయిలో కోలుకొని మీడియాతో కూడా మాట్లాడతారని ఆశిస్తున్నానని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఏవి నమ్మవద్దని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతానికి శరత్ బాబు క్షేమంగానే ఉన్నారని కొంత కోలుకున్న తర్వాత మీడియాతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తానని ఆమె చెబుతున్నారు. అయితే అటు తెలుగు మీడియాతో పాటు తమిళ మీడియాలో కూడా శరత్ బాబుకు కన్నుమూశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా రెస్ట్ ఇన్ పీస్ శరత్ బాబు అనే పదం ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. నిజానికి ఆయన చనిపోకుండానే చనిపోయారంటూ ప్రచారం చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండేదని కానీ కోలుకోవడంతో రూమ్ కి కూడా షిఫ్ట్ చేశారని చెబుతున్నారు. కాబట్టి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ గానే భావించాల్సి ఉంటుంది.
Also Read: Nagachaitanya: ఆ టైటిల్ పెడితే చంపేస్తారన్న చైతూ.. అందుకే మార్చానంటున్న డైరెక్టర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook