Army new uniform: భారత ఆర్మీకి కొత్త యూనిఫాం- అమెరికా సైన్యంలా డిజిటల్​ ప్రింట్​​తో!

Army new uniform: భారత ఆర్మీ సుధీర్ఘ కాలంగా కొనసాగిస్తున్న యూనిఫాం త్వరలో పూర్తిగా మారనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆర్మీ నూతన యూనిఫాం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2021, 08:52 AM IST
  • భారత ఆర్మీకి త్వరలో కొత్త యూనిఫాం
  • జనవరి 15న అధికారికంగా ప్రదర్శన
  • డిజిటల్ ప్యాట్రాన్​తో రానున్నట్లు సమాచారం
Army new uniform: భారత ఆర్మీకి కొత్త యూనిఫాం- అమెరికా సైన్యంలా డిజిటల్​ ప్రింట్​​తో!

Indian Army will have a new combat uniform: భారత సైన్యం కోసం కొత్త యూనిఫాం తీసుకురానున్నట్లు సంబంధిత వర్గాల  ద్వారా తెలిసింది. ఆర్మీ సిబ్బందికి మరింత సౌలభ్యం ఇవ్వడంతో పాటు..  మన్నికగా ఉండే యూనిఫామ్​ను తీసుకురానున్నట్లు (Army new uniform) వెల్లడైంది.

కొత్త యూనిఫాం రంగు ప్రకృతిలో సులభంగా కలిసిపోయే విధంగా.. ఎలాంటి కాలంలోనైనా సిబ్బందికి అనుకూలంగా ఉండేలా దీనిని డిజైన్​ చేసినట్లు (Army new uniform Design) అధికారిక వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా శత్రువులు గుర్తించలేని విధంగా ఈ యూనిఫామ్​ ఉంటుందని పేర్కొన్నాయి. వివిధ రంగుల సమ్మేళనంతో ఈ యూనిఫాం ఉండనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పుడున్న యూనిఫాంతో పోలిస్తే బరువు తక్కువగా ఉంటుందని (New uniform of indian army) వెల్లడించాయి.

జనవరి 15న ఆర్మీ డే పరేడ్ సందర్భంగా కొత్త యూనిఫాంను అధికారికంగా ప్రదర్శించనున్నారు. ఆర్మీ సిబ్బంది కొత్త యూనిఫాం ధరించే కవాతు చేయనున్నారని తెలిసింది.

భారత ఆర్మీ యూనిఫాంలో ఇప్పటి వరకు పెద్దగా మార్పు లేదు. అయితే ప్రస్తుత అవసరాలు దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కొత్త యూనిఫాంను అభివృద్ధి చేసినట్లు తెలిసింది.

కొత్త డిజైన్​ గురించి..

'కొత్త యూనిఫాం అమెరికా ఆర్మీ మాదిరి.. డిజిటల్​ ప్యాట్రాన్​తో (Indian army new uniform pattern) రానుంది. ఇప్పుడున్న యూనిఫాంతో పోలిస్తే.. ఇది సులభంగా ప్రకృతిలో కలిసిపోతుంది' అని ఓ అధికారి వివరించారు.

ప్రస్తుతమున్న యూనిఫాంను పారా మిలిటరీ సిబ్బంది కూడా ధరించడంపై.. ఆర్మీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త యూనిఫాంతో ఈ సమస్యకు కూడా పరిష్కారం లభించనుంది.

అన్ని రకాలుగా చర్చించిన తర్వాతే కొత్త యూనిఫాంను తీసుకారావాలని నిర్ణయించినట్లు ఆర్మీ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త యూనిఫాం డిజైన్​ కోసం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సహకారం కూడా తీసుకున్నట్లు తెలిపాయి. వివిధ దేశాల ఆర్మీ యూనిఫాంను కూడా పరిశోధించినట్లు వివరించాయి. వాటన్నింటిని పరిగణించి సరికొత్త డిజైన్​తో ఈ యూనిఫాంను తీసుకొచ్చినట్లు పేర్కొన్నాయి.

Also read: Lady Constable Gender Reassignment: లేడీ కానిస్టేబుల్ లింగ మార్పిడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

Also read: COVID-19 vaccine ZyCoV-D : 7 రాష్ట్రాల్లో చిన్నారులకు జైకోవ్‌-డీ కోవిడ్ వ్యాక్సిన్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News