బ్రేకింగ్: కమెడియన్ వేణుమాధవ్ కండీషన్ సీరియస్ !!

ఆడియన్స్ కడుపుబ్బ నవ్వించే వేణు మాధవ్ ఆరోగ్య  పరిస్థితి విషమయంగా ఉంది.

Last Updated : Sep 24, 2019, 11:39 PM IST
బ్రేకింగ్: కమెడియన్ వేణుమాధవ్ కండీషన్ సీరియస్ !!

టాలీవుడ్ కు చెందిన ప్రముఖ కమిడియన్ వేణు మాధన్  తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. గత కొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న వేణు..ఇప్పుడు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయన్న హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. వేణు ఆరోగ్య ఆందోళనకరంగా ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. 

గత కొనేళ్ల నుంచి ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వేణుమాధవ్ ... గత నాలుగైదేళ్ల నుంచి ఆయ‌న సినిమాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం ఆయన ఆరోగ్యం బాలేదని వచ్చిన వార్తలపై స్వయంగా స్పందించి పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ప్రకటించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే వేణుమాధవ్ పరిస్థితిని తెలుసుకునేందుకు పలువురు సినీ ప్రముఖలు ఆస్పత్రికి క్యూకడుతున్నారు.

Trending News