ఈ ఉప్మా రోజు తింటే.. ఎంతో వేగంగా బరువు తగ్గడం ఖాయం..

Dharmaraju Dhurishetty
Feb 07,2025
';

బరువు, శరీరంలోని కొలెస్ట్రాల్ నియంత్రించుకోవాలనుకునే వారు తప్పకుండా ఆరోగ్యం పై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

';

ప్రస్తుతం చాలామంది అధిక బరువు కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి వీటి బారిన పడకుండా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

';

కొంతమంది పెరుగుతున్న బరువును స్పీడుగా తగ్గించుకునేందుకు అల్పాహారాలు, భోజనం చేయడం మానేస్తున్నారు. ఇలా చేయడం అసలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

నిజానికి అల్పాహారంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు చేర్చుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గచ్చని నిపుణులు తెలుపుతున్నారు.

';

ముఖ్యంగా ప్రతిరోజు తీసుకునే అల్పాహారంలో భాగంగా జొన్న రవ్వతో చేసిన ఉప్మా తినడం వల్ల ఎంతో స్పీడ్ గా బరువు తగ్గొచ్చట..

';

మీరు కూడా స్పీడ్ గా బరువు తగ్గడానికి జొన్న ఉప్మాను ఇంట్లోనే తయారు చేసుకొని తింటారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

జొన్న ఉప్మాకు కావలసిన పదార్థాలు: జొన్నలు - 1 కప్పు, ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగిన), పచ్చిమిర్చి - 2 (చిన్నగా తరిగిన), క్యారెట్ - 1/2 కప్పు (చిన్నగా తరిగిన), బీన్స్ - 1/4 కప్పు (చిన్నగా తరిగిన), బఠాణీలు - 1/4 కప్పు

';

కావలసిన పదార్థాలు: నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - 1/2 టీస్పూన్, జీలకర్ర - 1/2 టీస్పూన్, శనగపప్పు - 1 టీస్పూన్, మినప్పప్పు - 1 టీస్పూన్, కరివేపాకు - కొన్ని, ఉప్పు - రుచికి తగినంత, నీరు - 2 కప్పులు

';

తయారీ విధానం: ముందుగా జొన్న రవ్వను బౌల్లోకి తీసుకొని అందులో తగినంత నెయ్యి వేసి బాగా ఎరుపు రంగులోకి వచ్చేంతవరకు వేపుకోవాల్సి ఉంటుంది. ఇలా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోండి.

';

ఆ తర్వాత స్టవ్ పై మరో బౌల్ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వేసుకొని బాగా వేపుకోండి.

';

అన్ని వేపుకున్న తర్వాత అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మరికొద్ది సేపు వేపుకోండి.

';

అన్ని బాగా వేగిన తర్వాత క్యారెట్ బీన్స్ బఠానీలు వేసి మరికొద్ది సేపు అటు ఇటు కలుపుతూ వేపుకోండి. చివరగా కొంచెం ఉప్పు వేసుకుని అందులో రవ్వకు సరిపడా అంత నీటిని పోసుకోండి.

';

నీటిని పోసుకున్న తర్వాత బాగా మరిగించుకోండి. ఇలా మరుగుతున్న నీటిలో ఉప్మా రవ్వను వేసి ఉండలు లేకుండా కలుపుకోండి.

';

ఆ తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఉడికించుకోండి. ఉడికిన తర్వాత వేడివేడిగా పల్లి చట్నీతో సర్వ్ చేసుకోండి.

';


';

VIEW ALL

Read Next Story