మకడామియాలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఖనిజాలు కూడా పుష్కలం.
ఇందులో రాగి, జింక్ పుష్కలంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.
అంతేకాదు మకడామియాలో విటమిన్ బి1, మాంగనీస్ కూడా ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగు చేస్తుంది.
మకడామియాలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి.
బరువు తగ్గాలనుకునే వారు మకడామియా డైట్ లో చేర్చుకోవాలి. ఇది కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది.
ఆరోగ్యకరమైన ఎముకలకు మకడామియా సహాయపడుతుంది.
మకడామియాలో ఫైబర్ కడుపు ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది.
మకడామియా చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.