ఈ ఇడ్లీలు ఉదయాన్నే తింటే.. కొండ లాంటి పొట్టైనా సన్నబడాల్సిందే..
Dharmaraju Dhurishetty
Feb 01,2025
';
రాగి పిండితో చేసిన ఇడ్లీలు రోజు తింటే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
';
రాగుల్లో ఉండే వివిధ రకాల పోషకాలు, ఖనిజాలు శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసేందుకు సహాయపడతాయి.
';
రాగుల్లో ఫైబర్ కూడా ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి దీనితో చేసిన అల్పాహారాలు ఉదయాన్నే తీసుకుంటే సులభంగా బరువు తగ్గొచ్చు అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
';
రాగుల్లో ఉండే కొన్ని మూలకాలు పొట్టను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయట. కాబట్టి సింపుల్ గా పొట్ట తగ్గాలనుకునేవారు ఉదయాన్నే రాగి పిండి ఇడ్లీలను తప్పకుండా టిఫిన్ గా తినండి.
';
రాగి పిండితో చేసిన ఇడ్లీలను ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
';
రాగి ఇడ్లీ తయారీ విధానం, కావలసిన పదార్థాలు: రాగి పిండి - 1 కప్పు, ఇడ్లీ రవ్వ - 1 కప్పు, మినపప్పు - 1/4 కప్పు, ఉప్పు, నీరు - తగినంత
';
తయారీ విధానం: ముందుగా రాగులతో పాటు మినప్పప్పును దాదాపు నాలుగు నుంచి తొమ్మిది గంటల పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది.
';
ఇలా నానబెట్టుకున్న రాగులను, మినప్పప్పును మిక్సీలో వేసుకుని ఇడ్లీ పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇందులోని తగినంత సుజీ రవ్వ, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి.
';
మిక్స్ చేసుకున్న మిత్రమా ఒక గంట పాటు పక్కన పెట్టి ఇడ్లీ పాత్రలను ఫిల్ చేసి స్ట్రీమ్ పై దాదాపు 20 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి.
';
ఇడ్లీలు బాగా ఉడికిన తర్వాత వేడివేడిగా అల్పాహారంగా సర్వ్ చేసుకుంటే.. అద్భుతమైన పోషకాలతో పాటు పొట్ట కూడా సులభంగా తగ్గుతుంది..