ఉదయాన్నే ఇది తాగితే.. 300 ఉన్న బిపి దెబ్బకు దిగి నార్మల్ అవ్వాల్సిందే..

Dharmaraju Dhurishetty
Feb 01,2025
';

రక్తపోటు కారణంగా ప్రస్తుతం యువతలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి.

';

ముఖ్యంగా రక్తపోటు వల్ల కొంతమందిలో గుండె సమస్యలతో పాటు మధుమేహం వంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తున్నాయి.

';

రక్తపోటుతో బాధపడే వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ముఖ్యంగా ఈ రక్తపోటు నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద శాస్త్రంలో అనేక రెమిడీలు ఉన్నాయి. అందులో ఒక రెమిడీ గురించి మనం తెలుసుకుందాం.

';

రోజు ఉదయాన్నే అధిక రక్తపోటు ఉన్నవారు బీట్రూట్ రసాన్ని తాగితే మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి9 (ఫోలెట్), విటమిన్ కె అధిక పరిమాణంలో లభిస్తాయి.

';

అలాగే బీట్రూట్లో శరీరానికి కావలసిన పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రసం తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

';

రక్తపోటు తగ్గించుకునేవారు ఇలా ఆయుర్వేద పద్ధతిలో బీట్రూట్ రసాన్ని తయారు చేసుకొని తాగితే మంచి ఫలితాలు పొందగలుగుతారు..

';

కావలసిన పదార్థాలు: బీట్రూట్ - 2 (మీడియం సైజు), నీరు - 1 కప్పు, నిమ్మరసం - 1/2 చెంచా (తగినంత), తేనె లేదా చక్కెర - రుచికి తగినంత

';

తయారీ విధానం: ముందుగా బీట్రూట్ ను తీసుకొని బాగా శుభ్రం చేసుకొని పై తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా కట్ చేసుకున్న ముక్కలను మిక్సీ జార్ లో వేసుకొని తగినంత నిమ్మరసం, తేన వేసి బాగా మిక్సీ పట్టుకోండి. ఇలా తయారుచేసిన రసాన్ని వడకట్టుకొని ఒక గ్లాసులోకి తీసుకోండి. అంతే బీట్రూట్ రసం తయారైనట్లే..

';

కావాలనుకుంటే బీట్రూట్ రసంలో పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న రసాన్ని ఉదయాన్నే తాగితే అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది..

';

VIEW ALL

Read Next Story