20 రోజుల్లోనే 3 కేజీలు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? ఈ డ్రింక్ మీకోసమే..
Dharmaraju Dhurishetty
Feb 01,2025
';
క్యారెట్ రసంలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో లభిస్తాయి.
';
అలాగే క్యారెట్ జ్యూస్‌లో ఫైబర్‌తో పాటు ఇతర ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి రోజూ తాగడం వల్ల అనేక లాభాలు పొందుతారు.
';
ప్రతిరోజు క్యారెట్ రసం తాగితే ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులనుంచి విముక్తి కలుగుతుంది. అలాగే చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి.
';
బరువు తగ్గాలనుకునే వారికి క్యారెట్ రసం ఒక వరం.. రోజు ఉదయం పరిగడుపున ఈ రసం తాగితే ఎంతో సింపుల్‌గా వెయిట్ లాస్ అవుతారు.
';
చాలామంది ఈ క్యారెట్ రసాన్ని తయారు చేసుకునే క్రమంలో వివిధ పొరపాట్లు పడుతున్నారు. దీనివల్ల సరైన ఫలితాలు పొందలేకపోతున్నారు.
';
ఇలా సులభంగా ఆయుర్వేద పద్ధతిలో క్యారెట్ రసాన్ని తయారు చేసుకోండి..
';
కావలసిన పదార్థాలు: క్యారెట్లు: 4-5 (మీడియం సైజు), నీరు: 1/2 కప్పు (కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు), నిమ్మరసం: 1/2 టీస్పూన్ (ఆప్షనల్), తేనె లేదా చక్కెర: రుచికి తగినంత (ఆప్షనల్)
';
తయారీ విధానం: ముందుగా క్యారెట్లను తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా శుభ్రం చేసుకున్న వాటిని దానిపై పొట్టు మొత్తం తొలగించి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి.
';
చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న క్యారెట్స్ ను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా బ్లైండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులో తగినంత నీరు, తేనే వేసుకుని మరికొద్దిసేపు గ్రైండ్ చేసుకోండి.
';
బాగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వడకట్టుకొని ఒక గ్లాసులోకి తీసుకోండి. అందులో తగినంత నిమ్మరసం కలుపుకొని రోజూ ఉదయాన్నే పరిగడుపున తాగండి.
';
రోజు ఉదయాన్నే పరిగడుపున తాగితే.. సులభంగా బరువు తగ్గడమే కాకుండా కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది.