ఈ లడ్డు ఉదయాన్నే తింటే గుండె దృఢంగా అవుతుంది!

Dharmaraju Dhurishetty
Feb 01,2025
';

ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.

';

యువతలో గుండె సమస్యలు ఉంటే తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

';

ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవడం వల్ల ఈ గుండె సమస్యల నుంచి సులభంగా రాకుండా జాగ్రత్తలు పడవచ్చు.

';

ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం రోజు ఉదయం గసగసాలతో తయారుచేసిన లడ్డు తింటే మంచి ఫలితాలు పొందుతారట.

';

గసగసాలలో కాల్షియం, ఫాస్పరస్ తోపాటు మెగ్నీషియం వంటి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. రోజు ఉదయాన్నే తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

';

ఈ గసగసాల లడ్డును ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

';

కావలసిన పదార్థాలు: గసగసాలు - 1 కప్పు, బెల్లం తురుము - 1/2 కప్పు, ఎండు కొబ్బరి తురుము - 1/4 కప్పు, వేయించిన పల్లీలు - 1/4 కప్పు, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి - 1/2 టీస్పూన్

';

తయారీ విధానం: ముందుగా గసగసాల లడ్డును తయారు చేసుకోవడానికి పాన్ పెట్టి అందులో గసగసాలు వేసి దోరగా వేపుకోవాల్సి ఉంటుంది.

';

అన్ని బాగా వేపుకున్న తర్వాత వాటిని పక్కకు తీసుకొని ఎండుకొబ్బరి, వేరుశనగను వేసుకొని బాగా వేపుకోండి.

';

అన్నింటినీ బాగా వేపుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో వీటన్నిటినీ వేసి బెల్లం తురుము కూడా వేయాల్సి ఉంటుంది. ఇలా అన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకోండి.

';

అన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత తగినంత యాలకుల పొడి, నెయ్యి వేసి వాటిని బాగా కలుపుకొని.. చిన్న చిన్న ముద్దలుగా కట్టుకోవాల్సి ఉంటుంది. అంతే గసగసాల లడ్డూలు తయారైనట్లే.

';

రోజు ఉదయాన్నే ఈ లడ్డు తింటే ఎముకల సమస్యలతో పాటు గుండె సమస్యలు కూడా తొలగిపోతాయి.

';

VIEW ALL

Read Next Story