కావలసిన పదార్థాలు: అల్లం - 1/2 టీస్పూన్ (తురిమిన), జీలకర్ర - 1/2 టీస్పూన్, ధనియాల పొడి - 1/2 టీస్పూన్, గరం మసాలా - 1/4 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేయించడానికి సరిపడా
';
తయారీ విధానం: ముందుగా ఈ సమోసాలను తయారు చేసుకోవడానికి స్టవ్ పై ఓ పాన్ పెట్టుకుని అందులో నూనె వేసుకుని వేడి చేసుకోండి.
';
వేడైన నూనెలో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మిర్చి వేసి బాగా వేపుకోండి. ఇలా వేపుకున్న తర్వాత తగినంత అల్లం తురుము వేసుకొని బంగారు రంగులోకి మారేంతవరకు వేపుకోండి.
';
అన్నీ బాగా వేపుకున్న తర్వాత క్యారెట్ తురుము వేసి బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, టమాటో ముక్కలు వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి.
';
ఆ తర్వాత ముందుగా సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్న సమోసా షీట్స్‌ను పరుచుకొని అందులో స్టఫింగ్ చేసి సమోసాల షేప్ లోకి మార్చుకోవాలి.
';
ఇలా తయారు చేసుకున్న సమోసాలను నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేపుకోండి. అంతే క్యారెట్ సమోసాలు రెడీ అయినట్లే..