ఈ వేపుడు తింటే.. జీర్ణ సమస్యలే రావు..

Dharmaraju Dhurishetty
Jan 31,2025
';

వారంలో రెండుసార్లు అయినా బెండకాయతో తయారుచేసిన వేపుడు తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయట.

';

బెండకాయ లో ఉండే బంక లాంటి ఫైబర్ పొట్టను ఆరోగ్యవంతంగా తయారు చేసేందుకు ఎంతగానో సహాయపడుతుందట.

';

ముఖ్యంగా క్రమం తప్పకుండా బెండకాయను ఆహారంలో చేర్చుకునే వారిలో ఎలాంటి పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

అయితే మీరు కూడా క్రమం తప్పకుండా ఇలా తయారుచేసిన బెండకాయ వేపుడును ఆహారంలో తప్పకుండా చేర్చుకోండి.

';

బెండకాయ వేపుడుకి కావలసిన పదార్థాలు: బెండకాయలు - 1/2 కిలోలు, ఉల్లిపాయలు - 2 (చిన్నవి, తరిగినవి), పచ్చిమిర్చి - 2 (చిన్నవి, చీల్చినవి), కరివేపాకు - 1 రెమ్మలు

';

కావలసిన పదార్థాలు: నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - 1/2 టీస్పూన్, జీలకర్ర - 1/2 టీస్పూన్, పసుపు - 1/4 టీస్పూన్, కారం - 1/2 టీస్పూన్, ధనియాల పొడి - 1/2 టీస్పూన్, ఉప్పు

';

తయారీ విధానం: ఈ బెండకాయ వేపుడు తయారు చేసుకోవడానికి ముందుగా బెండకాయలను బాగా శుభ్రం చేసుకొని కాటన్ డబల్ తో తడి ఆరేంతవరకు తూడ్చుకోండి.

';

బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ పై బౌల్ పెట్టుకొని అందులో తగినంత నూనెను వేసుకోండి.

';

నూనె బాగా వేడి అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చితో పాటు కరివేపాకు వేసి బాగా వేపుకోండి.

';

ఇలా వేయించుకున్న తర్వాత అందులోనే బెండకాయ ముక్కలు వేసుకొని బంగారు రంగులోకి వచ్చేంతవరకు బాగా వేయించుకోండి.

';

ఇలా వేయించుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే బెండకాయ వేపుడు రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story