కావలసిన పదార్థాలు: 1 బంగాళదుంప(తరిగిన), 4 కప్పుల నీరు, 1/2 కప్పు క్రీమ్, ఉప్పు, మిరియాలు రుచికి, 2 టేబుల్ స్పూన్లు నూనె లేదా వెన్న
';
తయారీ విధానం: స్వీట్ కార్న్ సూప్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో బట్టర్ వేసి వేడి చేయండి.
';
వేడి చేసిన బటర్లో వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి బాగా వేపుకోవాల్సి ఉంటుంది. అందులోనే క్యారెట్, బంగాళదుంపలను వేసి మరికొద్ది సేపు వేపుకోండి.
';
ఇలా అన్ని వేపుకున్న తర్వాత వీటన్నిటిని తీసి మిక్సీలో వేసుకొని మిశ్రమంలో తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో బౌల్ పెట్టుకొని అందులో మరికొంత బటర్ వేసుకుని ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోండి.
';
ఆ తర్వాత ఆ మిశ్రమంలో క్రీంతో పాటు స్వీట్ కార్న్, మిర్యాల పొడి వేసి 15 నుంచి 20 నిమిషాల పాటు నీటిని పోసి ఉడికించుకోండి. అంతే స్వీట్ కార్న్ సూప్ తయారైనట్లే..