ఉదయాన్నే ఈ దోసలు తింటే.. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఖాళీ అవ్వడం ఖాయం..
Dharmaraju Dhurishetty
Feb 07,2025
';
ప్రస్తుతం చాలామందిలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగి తీవ్ర గుండె సమస్యల బారిన పడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా గుండె సమస్యలతో మరణిస్తున్నారు.
';
భారతదేశ వ్యాప్తంగా అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజుకి క్రమంగా పెరుగుతూ వస్తోంది.
';
శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమైతే ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
';
ఎంతో సులభంగా పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చు. దీనికోసం చేయాల్సినదల్లా ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవడమే..
';
ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను డైట్ లో చేర్చుకోవడం వల్ల కూడా సులభంగా కొవ్వు కరిగిపోతుంది.
';
ముఖ్యంగా జొన్నలతో చేసిన దోసలను అల్పాహారంలో తీసుకుంటే విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే దీర్ఘకానికి వ్యాధులు కూడా చుట్టుముట్టవు.
';
మీరు కూడా ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా జొన్న దోసలను తయారుచేసుకుని తినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి.
';
జొన్న దోస తయారీకి కావలసిన పదార్థాలు: జొన్న పిండి - 1 కప్పు, మినపప్పు - 1/4 కప్పు, బియ్యం - 1 టేబుల్ స్పూన్, మెంతులు - 1/2 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నీరు - పిండి కలపడానికి తగినంత, నూనె - దోసలు వేయించడానికి
';
తయారీ విధానం: ఈ దోసల తయారు చేసుకోవడానికి ముందుగా మినప్పప్పు, బియ్యం, జొన్నలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మిశ్రమంలో తయారు చేసుకోండి.
';
ఇలా తయారు చేసుకున్న బ్యాటర్‌ను దాదాపు నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అందులోనే మెంతులు, ఉప్పు, అటుకులు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోండి.
';
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ పై దోశ పెనం పెట్టుకొని వేడి చేసుకోండి.
';
ఇలా వేడెక్కిన దోస పెనం పై దోసలను వేసుకోండి. ఇలా తయారు చేసుకున్న దోసలను రోజు ఉదయాన్నే తింటే బోలెడు లాభాలు పొందుతారు. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది..