బొంబాయి రవ్వతో ఇడ్లీలు.. ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోరు టెస్ట్..

user Dharmaraju Dhurishetty
user Oct 20,2024

చాలామంది బ్రేక్ ఫాస్ట్ లో రోజు ఇడ్లీలు తిని బోర్ కొడుతూ ఉంటుంది.. ఇలాంటి వారి కోసం బొంబాయి రవ్వ ఇడ్లీల రెసిపీ..

ఈ బొంబాయి రవ్వ ఇడ్లీ తినడం వల్ల కూడా శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

ఇంకెందుకు ఆలస్యం బొంబాయి రవ్వ ఇడ్లీ తయారీ, కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ - 1 కప్పు, పెరుగు - 1/2 కప్పు, నీరు - 1/4 కప్పు, ఉప్పు - తగినంత, వంట సోడా - 1/4 టీస్పూన్, నెయ్యి - 1 టీస్పూన్ (ఇడ్లీ రేకులకు రాసుకోవడానికి), తరిగిన కొత్తిమీర - అవసరమైతే

తయారీ విధానం: ఈ బొంబాయి రవ్వ ఇడ్లీలను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ఫ్యాన్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఆ బౌల్ని స్టవ్‌ పై పెట్టి అందులో బొంబాయి రవ్వ వేసుకొని ఎరుపు రంగులోకి మారేంతవరకు బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.

ఇలా వేయించుకున్న తర్వాత ఒక పాత్రలో రవ్వను వేసుకొని అందులో పెరుగు, నీరు, ఉప్పు, కావలసినంత కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత ఇలా తయారు చేసుకున్న బ్యాటర్ను రెండు నుంచి మూడు గంటల పాటు బాగా విశ్రాంతిని ఇవ్వాల్సి ఉంటుంది.

ఇప్పుడు ఈ బ్యాటర్ ను తీసుకొని ఇడ్లీ పాత్రల్లో వేసుకొని.. ఇడ్లీ కుక్కర్ లో పెట్టుకొని 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఆవిరిపై ఉడకనివ్వాలి.

ఇడ్లీలు ఉడికినాయా లేదా అనేది టూత్ పిక్ తో పరీక్షించి స్టవ్ పై నుంచి దింపి వేయాలి.. ఉడికిన తర్వాత బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి..

VIEW ALL

Read Next Story