బరువు పెరగాలనుకునేవారు అరటిపండును పాలతో కలిపి మిక్సీ చేసి కేక్, షేక్‌లుగా తీసుకోవచ్చు.
బరువు తగ్గాలనుకునేవారు అరటిపండును ఉదయం గ్రీన్ టీ తాగిన కాసేపటికి టిఫిన్ బదులు తినాలి.
పాలతో అరటిపండు తినడం బరువు పెరగడానికి సహాయపడుతుంది.
స్నాక్‌గా.. లేదా టిఫిన్ బదులుగా.. తక్కువ పరిమాణంలో అరటిపండు తినడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
వర్కౌట్ తర్వాత అరటిపండు తినడం శక్తిని పెంచి.. కండరాలకు మేలుచేస్తుంది. కాబట్టి పరువు తగ్గాలి అనుకున్న వారు.. వర్కౌట్ చేసిన తర్వాత అరటిపండు ని తినవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారు అధిక పరిమాణంలో అరటిపండు తినకుండా జాగ్రత్తగా ఉండాలి.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే.