స్పీడ్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజు గ్లాసు ఇది తాగండి!
Dharmaraju Dhurishetty
Feb 19,2025
';
బొప్పాయి పండు రసం రోజు ఉదయం తాగడం వల్ల ఎన్నో రకాల లాభాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
';
బొప్పాయి పండు రసంలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ ఎక్కువ పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి రోజు తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి.
';
అలాగే ఈ రసంలో ఫోలిక్ యాసిడ్, పొటాషియం, ఫైబర్, పాపైన్ వంటి ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ క్రియ వ్యవస్థను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి.
';
తరచుగా గ్యాస్ట్రిక్, మలబద్ధకం, ఇతర పొట్ట సమస్యలతో బాధపడే వారు తప్పకుండా ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలు పొందుతారు.
';
ఈ రసంలో ఉండే కొన్ని గుణాలు శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి. అలాగే కొవ్వును కూడా కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
';
అన్ని రకాల పోషకాలు శరీరానికి అందాలంటే తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన పద్ధతిలో బొప్పాయి పండు రసాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
';
ముందుగా బొప్పాయి పండు రసాన్ని తయారు చేసుకోవడానికి పండిన పెద్ద బొప్పాయిని తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని బాగా శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకోండి.
';
ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వీటిని వేసుకొని తగినంత తేనె వేసుకోండి. ఇలా రెండింటిని మిక్సీ కొట్టుకోండి.
';
మిక్సీ పట్టుకున్న తర్వాత మిశ్రమాన్ని ఒక గాజు గ్లాసులోకి తీసుకుని.. ఉదయాన్నే తాగండి. ఇలా ఉదయాన్నే తాగితే పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా శరీర బరువు తగ్గుతారు.