ఖాళీ కడుపుతో ఈ రసం తాగితే.. ఎన్ని కేజీల బరువున్న దెబ్బకు తగ్గాల్సిందే..

Dharmaraju Dhurishetty
Jan 31,2025
';

పాలకూర రసంలో వివిధ పోషకాలు లభించడమే కాకుండా.. ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువ మోతాదులో లభిస్తాయి.

';

కాబట్టి రోజు ఉదయాన్నే పాలకూర రసాన్ని తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ముఖ్యంగా శరీర బరువును నియంత్రించుకోవాలనుకునేవారు రోజు ఉదయాన్నే టీ కి బదులుగా పాలకూర రసాన్ని తాగితే సులభంగా మంచి ఫలితాలు పొందగలుగుతారు.

';

అలాగే ఈ రసంలో ఉండే గుణాలు శరీరంలోని బ్యాడ్ కొవ్వును తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ముఖ్యంగా మలబద్ధకంతో పాటు గ్యాస్టిక్ ఇతర పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రోజు ఉదయాన్నే ఈ రసాన్ని దాగాల్సి ఉంటుంది. తాగితే జన్మలో ఈ పొట్ట సమస్యలు రావు.

';

కొంతమంది పాలకూర రసాన్ని నేరుగా తాగుతున్నారు. అయితే ఈ కింది పద్ధతిలో తయారుచేసుకొని తాగితే మంచి ఫలితాలు పొందగలుగుతారు.

';

పాలకూర రసం తయారీ విధానం, కావలసిన పదార్థాలు: 1 కట్ట పాలకూర, 2 టమోటాలు, 1/4 టీస్పూన్ జీలకర్ర పొడి, నీరు

';

తయారీ విధానం: ముందుగా ఈ రసాన్ని తయారు చేసుకోవడానికి పాలకూరని తీసుకొని బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

అలాగే శుభ్రం చేసుకున్న టమాటోలను పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి.

';

అదే మిక్సీ జారులు జీలకర్ర పొడి, తగినంత నీటిని వేసుకుని బాగా మిక్సీ కొట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గ్లాసులోకి రసాన్ని వడకట్టుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగండి.

';

ప్రతిరోజు ఉదయాన్నే ఇలా కాళీ కడుపుతో తాగితే శరీర బరువుతో పాటు కొలెస్ట్రాల్, పొట్ట సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

';

నోట్: ఈ చిట్కాను వినియోగించే ముందు వైద్యులను సంప్రదించి వారిని సలహాల మేరకే దీనిని తీసుకోవడం మంచిది.

';

VIEW ALL

Read Next Story