ది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ హై ప్రోటీన్ బనానా ఆమ్లెట్ రెసిపీ..
Dharmaraju Dhurishetty
Feb 06,2025
';
అరటికాయతో చేసిన ఆహార పదార్థాలను డైట్లో చేర్చుకుంటే బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో పొటాషియంతో పాటు వివిధ రకాల ఖనిజాలు లభిస్తాయి.
';
అరటికాయతో అనేక రకాల విటమిన్స్ తో పాటు మినరల్స్ కూడా లభిస్తాయి. కాబట్టి రోజు అరటికాయతో చేసిన ఆహారాలను అల్పాహారంలో తీసుకుంటే అద్భుతమైన శరీరం లాభాలు కలుగుతాయి.
';
ఈ అరటికాయలో కేవలం పొటాషియమే ఉంటుంది.. దీనికి తోడు మిక్స్ చేసి ఆమ్లెట్ల తయారు చేసుకొని తింటే మరెన్నో లాభాలు పొందుతారు.
';
ముఖ్యంగా పిల్లలకు లంచ్ బాక్స్ లో ఈ రెసిపీని అందిస్తే ప్రోటీన్ లోపం సమస్యలే రాకుండా ఉంటాయి.
';
ప్రోటీన్ అండ్ పొటాషియంతో కూడిన బనానా ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
';
అవసరమైన పదార్థాలు: 1 పచ్చి అరటికాయ, 4 గుడ్లు, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి
';
కావలసిన పదార్థాలు: 1/2 టీ స్పూన్ కారం పొడి లేదా 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ క్యాప్సికం, రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి
';
తయారీ విధానం: ముందుగా ఒక అరటికాయని తీసుకొని బాగా శుభ్రం చేసి తొక్క తీసి మిక్సీ గ్రైండర్లో వేసి మిశ్రమంలో తయారు చేసుకోండి.
';
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక చిన్న గిన్నెలో వేసుకుని అందులో పైన పేర్కొన్న అన్ని పదార్థాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి.
';
అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో రెండు నుంచి మూడు గుడ్లను వేసుకొని బాగా మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
';
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని దాదాపు పది నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ పై ఓ పెనం పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకుని బాగా వేడి చేసుకోండి.
';
నూనె బాగా వేడి అయిన తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో పోసుకొని బాగా కాల్చుకోండి. రెండు వైపులా బాగా కాలిన ఆమ్లెట్ ని తీసి పక్కన పెట్టుకోండి. అంతే బనానా ఆమ్లెట్ రెడీ అయినట్లే..