ఉదయాన్నే ఇది తాగితే.. బరువు, కొలెస్ట్రాల్ సమస్యలు దూరం..

Dharmaraju Dhurishetty
Feb 11,2025
';

చాలామంది అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, అధిక బరువు వంటి సమస్యల భారిన పడుతూ ఉంటారు.

';

ప్రస్తుతం చాలామంది యువతలు కూడా ఈ మూడు దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. నిజానికి వీటిని అదుపులో ఉంచుకోవడం చాలా కష్టం.

';

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా ఆహారాలను డైట్ పద్ధతిలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.

';

చాలామంది ఉదయం అల్పాహారంలో భాగంగా విభిన్న రకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. వీటికి బదులుగా ఉదయాన్నే కొన్ని రకాల జావాలు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులను కంట్రోల్ చేసుకోవచ్చు.

';

ప్రతిరోజు ఉదయాన్నే జొన్నపిండితో తయారుచేసిన జావా తీసుకోవడం వల్ల అధిక బరువుతో పాటు మధుమేహం, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

';

చాలామంది జొన్న జావా తయారు చేసుకునే క్రమంలో.. తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు పడుతున్నారు. దీనివల్ల ఈ జావా తాగడం వల్ల ఎలాంటి లాభాలు పొందలేకపోతున్నారు.

';

అయితే ఆయుర్వేద పద్ధతిలో ఈ జావాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

';

కావలసిన పదార్థాలు: జొన్న పిండి - 1/2 కప్పు, నీరు - 2 కప్పులు, మజ్జిగ - 1 కప్పు, ఉప్పు - రుచికి తగినంత

';

తయారీ విధానం: ముందుగా జొన్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోనే నీటిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని.. స్టవ్ పై మరో బౌల్ పెట్టుకొని అందులో నీటిని పోసుకొని బాగా మరిగించుకోండి.

';

మరుగుతున్న నీటిలో ఉప్పు మజ్జిగ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత జొన్నపిండి వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోండి.

';

జొన్న పిండి ఉడికిన తర్వాత రెండు నుంచి మూడు గంటలు ఆగి.. సర్వ్ చేసుకుంటే అద్భుతమైన లాభాలు పొందుతారు.

';

VIEW ALL

Read Next Story