ఈ ఒక్క లడ్డు 100 ఔషధ మూలికలతో సమానం.. రోజు తింటే గుండె భద్రమే..
Dharmaraju Dhurishetty
Feb 04,2025
';
యువత ఎక్కువగా గుండె సమస్యల బారిన పడడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి అనారోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తినడం.
';
ప్రస్తుతం చాలామంది యువత ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల పోషకాలతో కూడిన ఆహారాలు తీసుకోవడం లేదు.
';
మరికొంతమంది పిల్లలైతే ఎక్కువగా బయట ఫుడ్స్ తినేందుకు ఇష్టపడుతున్నారు. దీనివల్ల చిన్న వయసులోనే గుండె సమస్యల బారిన పడుతున్నారు.
';
గుండె సమస్యలతో బాధపడే వారికి పచ్చికొబ్బరి ఔషధం కంటే ఎక్కువ. ఎందుకంటే ఇందులో వివిధ రకాల పోషకాలతో పాటు ఖనిజాలు కూడా లభిస్తాయి.
';
కాబట్టి పచ్చి కొబ్బరితో చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు పొందుతారు. ముఖ్యంగా దీనితో చేసిన లడ్డు తింటే గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎన్నో సమస్యలు దూరం అవుతాయి.
';
మీరు కూడా ఇంట్లోనే సులభంగా పచ్చికొబ్బరితో లడ్డును తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి..
తయారీ విధానం: ఈ లడ్డును తయారు చేసుకోవడానికి ముందుగా పచ్చికొబ్బరిని బాగా తరుముకోండి. అందులో నుంచి పాలను మొత్తం తీసేసి ఒక పిప్పిని మాత్రమే పక్కన పెట్టుకోండి.
';
ఆ తర్వాత ఓ పాన్ వేడి చేసుకొని అందులో తగినంత నెయ్యి వేసుకొని వేరు చేసిన కొబ్బరి పిప్పిని అందులో వేసుకొని బాగా వేపుకోండి. బాగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోండి.
';
మరో బౌల్ తీసుకొని అందులో బెల్లం తురుము వేసుకొని పాకం వచ్చేంతవరకు బాగా కలుపుతూ మరిగించుకోండి. పాకం వచ్చిన తర్వాత వేపుకున్న కొబ్బరి పొడిని అందులో వేసుకొని బాగా మిశ్రమంలో కలుపుకోండి.
';
మిశ్రమంలా కలుపుకున్న తర్వాత అందులోని కావాల్సినన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని చిన్న చిన్న ముద్దలా కట్టుకొండి. అంతే గుండె ఆరోగ్యాన్ని పెంచే కొబ్బరి లడ్డులు తయారైనట్లే..